Summer Precautions: ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమరుపాటుగా ఉంటే మన ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. అజాగ్రత్తలతో ఉంటే మనకు నష్టాలే ఎక్కువ. అప్రమత్తంగా ఉంటే మనకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా టోపీ ధరించాలి. నెత్తికి రుమాలు కట్టుకోవాలి. దీని వల్ల వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మనం కొన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందే.
రోజు కచ్చితంగా 4-5 లీటర్ల మంచినీరు తాగాలి. తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఫలితంగా వడదెబ్బ సోకుతుంది. ఈ నేపథ్యంలో మనం బయటకు వెళితే నీళ్ల బాటిల్ తీసుకెళ్లాలి. దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. అందులో నిమ్మరసం పిండుకుంటే ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల వడదెబ్బ బారి నుంచి రక్షించుకోవచ్చు.
ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే చర్మానికి లోషన్ రాసుకోవాలి. దీంతో సూర్య కిరణాలు మనపై పడినా వడదెబ్బ సోకకుండా చేసుకునే వీలుంటుంది. ఎండా కాలంలో మద్యం తాగడం అంత మంచిది కాదు. శరీరం డీ హైడ్రేడ్ అయితే కోలుకోవడం కష్టం. అందుకే అల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చలువ కోసం కొబ్బరి బొండాలు తాగడం ఉత్తమం.
వేసవిలో చల్లగా ఉండే ఆకుకూరలు తీసుకోవడం మంచిది. దోసకాయ, దానిమ్మ, పుచ్చకాయ వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరం డీ హైడ్రేడ్ కాకుండా ఉంటుంది. దీంతో కిడ్నీలు, గుండెకు కూడా ముప్పు ఏర్పడుతుంది. మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తాగడం వల్ల మనకు వడదెబ్బ సోకే అవకాశం ఉండదు. ఇలా వేసవి కాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి.