https://oktelugu.com/

Balagam Movie TRP Ratings: TRP రేటింగ్స్ లో సంచలనం సృష్టించిన ‘బలగం’.. RRR కి అతి చేరువలో!

బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 50 లక్షల రూపాయిల షేర్ తో ప్రారంభమైన ఈ సినిమా దాదాపుగా 13 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఇందులో 10 కోట్ల రూపాయిల షేర్ కేవలం నైజాం ప్రాంతం నుండి రావడం విశేషం.

Written By:
  • Vicky
  • , Updated On : May 18, 2023 / 03:01 PM IST

    Balagam Movie TRP Ratings

    Follow us on

    Balagam Movie TRP Ratings: ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన చిత్రం ‘బలగం’. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చిన్నప్పటి నుండి తాను పుట్టి పెరిగిన తెలంగాణ ప్రాంతం లో ఉండే సంస్కృతి మరియు సంప్రదాయాలను, మనసుకు హత్తుకునే ఎమోషన్స్ తో ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 50 లక్షల రూపాయిల షేర్ తో ప్రారంభమైన ఈ సినిమా దాదాపుగా 13 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఇందులో 10 కోట్ల రూపాయిల షేర్ కేవలం నైజాం ప్రాంతం నుండి రావడం విశేషం.సినిమాకి మంచి రన్ వస్తున్నా సమయం లోనే ఓటీటీ లో విడుదల చేసారు. అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమాని స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేసారు.

    ఈ టెలికాస్ట్ కి కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. BAARC సంస్థ ఈరోజు విడుదల చేసిన TRP రేటింగ్స్ పట్టిక లో ‘బలగం’ చిత్రానికి వచ్చిన రేటింగ్స్ ని చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ చిత్రానికి అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలకు కలిపి 14.3 రేటింగ్స్ వచ్చాయట. ఇక హైదరాబాద్ లో అయితే ఈ సినిమాకి 22 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయట.

    రాజమౌళి #RRR మొట్టమొదటి టెలికాస్ట్ కి హైదరాబాద్ లో కేవలం 18 రేటింగ్స్ మాటమే వచ్చాయి. కానీ బలగం చిత్రానికి అంతకు మించి రావడాన్ని చూస్తుంటే ఈ చిత్రం తెలంగాణ ప్రక్కలకు ఎంతలా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు, గడిచిన 8 నెలల్లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన స్టార్ హీరోల సినిమాలకంటే ఎక్కువ TRP రేటింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం.