Hair Health: కాలుష్యమైన వాతావరణం, మారుతున్న జీవనశైలి జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనడం చాలా అవసరం. లేదంటే మరింత ఎక్కువ అవుతాయి జుట్టు సమస్యలు. ఇక వచ్చింది చలికాలం కాబట్టి జుట్టు సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని టిప్స్ పాటిస్తే జుట్టు సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. ఇక జుట్టుకు షాంపూ, నూనె వంటివి ఎంత ముఖ్యమో సరైన విధంగా నూనె అప్లే చేయడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు.
చాలా మంది జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలతో బాధ పడుతున్నారు. జుట్టు ఊడిపోవడం, చిట్లడం, తెల్లగా అవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందులోనూ చలికాలం కదా. సో ఈ సమస్యలు మరింత వేధిస్తాయి. అందులో ముఖ్యంగా జుట్టు రాలే సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే తలకు సరిగ్గా నూనె పెట్టాలి. దీని వల్ల చాలా వరకు జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. జుట్టు ఒత్తుగా ఉంటే అందంగా కనిపిస్తుంది. ఇలాంటి జుట్టు అందరికీ ఇష్టం. మగవారికైనా, ఆడవారికైనా జుట్టు ఒత్తుగా ఉంటే అందంగా కనిపిస్తారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు సమస్యలు బాగా పెరిగి పోయాయి. చాలా మందికి జుట్టు రాలిపోతుంది. అందుకే పల్చగా అవుతున్నాయి. దీంతో అంద విహీనంగా మారుతుంది జుట్టు.
జుట్టుకు పోషకాలు అందడం చాలా ముఖ్యం. అయితే ఈ పోషణను ఫుడ్ ద్వారా అందించాలి. ఇలా చేస్తూనే ఆయిల్ ను సరైన విధానంలో అప్లే చేయాలి. దీని వల్ల జుట్టు రాలే సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. చాలా మందికి జుట్టుకు ఆయిల్ పెట్టుకోవడం కూడా సరిగ్గా రాదు. ఎలా పడితే అలా అప్లే చేస్తారు. దీని వల్ల కుదుళ్లు డిస్టర్బ్ అవుతుంటాయి. ఆయిల్‌ని గోరు వెచ్చని నీళ్ల ద్వారా వేడి చేయాలి. ఇలా చేసి ఆయిల్ గోరు వెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు అప్లే చేయాలి. కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకుంటూ కుదుళ్లకు పట్టించడం వల్ల సరిగ్గా అప్లే అవుతుంది.
ముందుగా జుట్టు మొత్తం రాయవద్దు. కేవలం మాడుపై రాయాలి. అది కూడా లైట్ గా రాసి లైట్‌గా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. దీంతో జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. గోరు వెచ్చని నూనె కాకున్నా నార్మల్ నూనె అయినా సరే కానీ ఇదే విధంగా అప్లే చేయాలి. కానీ గోరు వెచ్చని నూనె వల్ల జుట్టు మెరుస్తుంది. స్మూత్ గా ఉంటుంది కూడా. రక్త ప్రసరణ జరిగుతుంది కాబట్టి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..