https://oktelugu.com/

Mobile Hack: ఈ మార్పులు మీ మొబైల్‌లో కనిపిస్తే.. హ్యాక్ అయినట్లే!

మొత్తం డిజిటల్ యుగం కావడంతో దీన్నే అలుసుగా చేసుకుని కేటుగాళ్లు ఈ పనికి పాల్పడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొందరు కొన్ని సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించి మొబైల్స్ హ్యాక్ చేస్తున్నారు. దీనివల్ల డబ్బు అనే కాకుండా పర్సనల్ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మరి మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 12, 2024 / 01:38 AM IST

    Mobile hack

    Follow us on

    Mobile Hack: ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్‌లు, హ్యాకింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా డిజిటల్ అరెస్టు కూడా ఒకటి వచ్చింది. అంతా ఆన్‌లైన్ అయిపోవడంతో కేటుగాళ్లు ప్రజలను మోసం చేసి కోట్లు సంపాదిస్తున్నారు. నిజం చెప్పాలంటే మనకి తెలియకుండానే మన ఫోన్ హ్యాక్ చేసి కూడా కొందరు డబ్బులు కాజేస్తున్నారు. డైలీ ఫోన్ మనమే వాడుతాం. కానీ ఆపరేటింగ్ మాత్రం ఇతరులు చేస్తుంటారు. మన ఫోన్‌కి వచ్చిన అన్ని వివరాలు కూడా మనకి తెలియకుండా చూస్తుంటారు. మొత్తం డిజిటల్ యుగం కావడంతో దీన్నే అలుసుగా చేసుకుని కేటుగాళ్లు ఈ పనికి పాల్పడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొందరు కొన్ని సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించి మొబైల్స్ హ్యాక్ చేస్తున్నారు. దీనివల్ల డబ్బు అనే కాకుండా పర్సనల్ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మరి మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

    కొందరు కేటుగాళ్లు ఏం చేస్తున్నారంటే.. ఇతరుల ఫోన్లను హ్యాక్ చేసి స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నారు. మీకు తెలియకుండా మీ ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ ఏదైనా చేస్తున్నారా? లేదా? తెలుసుకోవాలంటే ఈ విషయాలు మరిచిపోవద్దు. మీ ఫోన్‌ స్క్రీన్‌పై గ్రీన్ కలర్‌లో నోటిఫికేషన్ కనిపిస్తే సందేహ పడండి. ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ కావాలంటే మొబైల్‌లోని కెమెరా, మైక్రోఫోన్ ఆన్‌లో ఉండాలి. అప్పుడే అవుతుంది. ఇలా మీకు గ్రీన్ నోటిఫికేషన్ కనిపిస్తే మీ ఫోన్‌ హ్యాక్ అయినట్లే. అలాగే కెమెరా సింబల్‌ చుట్టూ కూడా ఒక బ్రాకెట్ లాగా కనిపిస్తుంది. ఈ మార్పులు ఏవైనా మీ మొబైల్‌లో కనిపిస్తే మాత్రం.. ఫో్ హ్యాక్ అయినట్లే గుర్తించండి. మీకు తెలియకుండా మీ ఫోన్‌లో ఏదైనా యాప్ ఉండవచ్చు. దీన్ని గుర్తించాలంటే యాప్స్‌లోకి వెళ్లి దాని యాక్సెస్‌ను క్యాన్సిల్ చేయండి. అప్పుడు మీ డేటా సురక్షితంగా ఉంటుంది.

    మీరు ఏ యాప్ వాడాలన్నా కూడా దానికి కొన్నింటి యాక్సెస్ ఇవ్వాలి. ముఖ్యంగా కెమెరా, కరెంట్‌ లొకేషన్‌, మైక్రోఫోన్‌కి తప్పకుండా ఇవ్వాలి. అయితే మీరు ప్రతి యాప్‌కి అడిగే విధంగా పెట్టుకోండి. కొందరు ఆటోమెటిక్‌గా యాక్సెస్ ఇచ్చే ఆప్షన్ పెట్టుకుంటారు. ఇలా కాకుండా ప్రతీ యాప్‌కి రిమాండ్ వచ్చే విధంగా పెట్టుకోండి. అప్పుడు మీరు కెమెరా, మైకో ఫోన్ ఇలా అన్నింటికి యాక్సెస్ ఇస్తేనే ఆ యాప్ వర్క్ అవుతుంది. లేకపోతే కాదు. మీకు తెలియకుండా ఎవరైనా మీ ఫోన్‌ను హ్యాక్ చేయవచ్చు. కాబట్టి ఈ సెట్టింగ్స్ తప్పకుండా పాటించండి. మీరు మీ మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్‌ ఆప్షన్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత యాప్‌పైన ట్యాప్‌ చేసి, పర్మిషన్స్‌ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. కెమెరా, కాంటాక్ట్స్‌, లొకేషన్‌, మైక్రోఫోన్‌ ఇలా మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్పుడు వాటిని క్లియక్ చేస్తే అలో వైల్‌ యూజింగ్‌ ది యాప్‌, డోంట్‌ అలో, ఆస్క్‌ ఎవ్రీ టైమ్‌ ఫర్‌ ద స్పెసిఫిక్‌ యాప్‌ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఏ ఆప్షన్ కావాలో అది పెట్టుకోవచ్చు. ప్రతీ సారి పర్మిషన్ ఆప్షన్ ఎంచుకుంటే బెటర్. ఎందుకంటే ఎవరైనా మీ మొబైల్ హ్యాక్ చేసిన గుర్తుపట్టవచ్చు. అలాగే మీకు తెలియకుండా మీ డేటాను తీసుకోలేరు.