https://oktelugu.com/

Foods : శీతాకాలంలో ఈ ఆహారాలు కచ్చితంగా తీసుకోండి.

వాతావరణం చల్లబడిందంటే బ్యాక్టీరియా, వైరస్‌లు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. వాటి కారణంగానే తరుచూ జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, గొంతు దురద వంటి ఎన్నో సమస్యలు చుట్టుముడుతాయి. వైరల్ ఫీవర్స్ కూడా మామూలే కదా. ముఖ్యంగా పిల్లల్లోనే ఇవి వస్తాయి. శీతాకాలంలో వాతావరణంలో తేమచేరుతుంది. దీనివల్లే రకరకాల సమస్యలు వస్తుంటాయి. అలాగే వాతావరణం చల్లబడితే రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా అవుతుంది. మనం తరచూ రోగాల బారిన పడేలా చేస్తుంటుంది. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని బలంగా మార్చుకోవాలి. అందుకే కొన్ని రకాల ఆహారాలను ప్రత్యేకంగా తీసుకోవాలి. అలాగే కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఆరోగ్యం బెటర్ అవుతుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 8, 2024 / 01:42 PM IST

    Take these foods strictly in winter.

    Follow us on

    Foods : విటమిన్ సి, డీ, జింక్, విటమిన్ ఏ, ఈ, ఐరన్, ఒమేగా-3, ప్యాటీ యాసిడ్స్, బి విటమిన్స్, ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఆకుకూరలు, పండ్లు, పాల పదార్థాలు, చేపలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని ఈ సమయంలో కాపాడుకోవచ్చు.

    అల్లం
    మీ ఆహారంలో అల్లం కచ్చితంగా చేర్చుకోండి. అల్లం టీ తాగడం లేదా సూపులలో అల్లం రసాన్ని వేసుకోవాలి. లేదంటే దంచిన అల్లాన్ని వేసి తినాలి. అల్లంలో ఉండే సుగుణాలు దగ్గు, జలుబుతో పోరాడే శక్తిని రోగనిరోధక వ్యవస్థకు అందిస్తాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి శీతాకాలంలో అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

    తులసి ఆకులు
    మన దేశంలో ఇంటికి ఒక తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. ఆ తులసి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఇన్నీ అన్నీ కావనే చెప్పవచ్చు. తులసి ఆకులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఫుల్ గా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తిని ఇస్తాయి. శ్వాస కోశవ్యవస్థను కాపాడటంలో సహాయపడతాయి. పొడి దగ్గు రాకుండా అడ్డుకుంటుంది తులసి.ఈ ఆకులను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. నీళ్ళల్లో కొన్ని తులసి ఆకులను వేసి మరగ కాయాలి. వాటిని వడకట్టి ఆ నీటిని తాగండి. మీకు చలికాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు దగ్గరికి రావు.

    ఉల్లిపాయ రసం
    ప్రతి ఇంట్లో ఉల్లిపాయలు కచ్చితంగా ఉంటాయి. ఉల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అవి పొడి దగ్గు రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి పచ్చి ఉల్లిపాయని ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి. లేదా ఉల్లిపాయ రసాన్ని తీసి రెండు స్పూన్లు తాగేందుకు ప్రయత్నించండి. మీకు దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

    తాజా పండ్లు కూరగాయలు
    తాజా పండ్లు, కూరగాయలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే గుణాలు ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండే కివి, స్ట్రాబెర్రీలు, టమోటోలు, కాలీఫ్లవర్, క్యాప్సికం వంటి వాటిని తీసుకోండి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడతాయి. నిమ్మరసం తాగడం వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి.

    ప్రతి ఇంట్లో తేనే ఉండడం సహజం. ఉదయం లేచాక పరగడుపున ఒక స్పూను తేనెను తాగేందుకు ప్రయత్నించండి. తేనెలో ఉండే గుణాలు ఎన్నో. ఎక్కువ ఇది యాంటీబయోటిక్ లా పనిచేస్తుంది. తీవ్రమైన దగ్గు నుంచి ఉపశమనం కలిగించేందుకు తేనె ఉపయోగపడుతుంది.