Sweet Potato Benefits: మానవ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాల ఆహార పదార్థాలను తినాల్సి ఉంటుంది. అన్నం, చపాతి మాత్రమే కాకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కొన్ని పండ్లు తినడం వల్ల అదనపు శక్తి వస్తుంది. అయితే వీటిలో కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత కనిపించవు. ఇలా కనిపించినప్పుడే తింటూ ఉండాలి. వాటిలో స్వీట్ పొటాటో ఒకటి. స్వీట్ పొటాటో ఎక్కువగా మార్చి సమయంలో మార్కెట్లోకి వస్తూ ఉంటుంది. అన్ని కాలాల్లో సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అయితే స్వీట్ పొటాటో తినడం వల్ల శరీరానికి వచ్చే ప్రయోజనాలు ఏవి? వీటిని ఎవరు తినకూడదు?
భారతదేశంలో ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో స్వీట్ పొటాటో ఎక్కువగా పండిస్తారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కొద్దిపాటు సాగు చేస్తూ ఉంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా మహాశివరాత్రి సమయంలోనే కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటున్నాయి. స్వీట్ పొటాటోలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. అందువల్ల స్వీట్ పొటాటో తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రోమన్ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎవరికైనా గాయాలు అయితే ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల వెంటనే అవి మానిపోతుంటాయి. అలాగే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి, ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు దీనిని తినడం వల్ల వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
స్వీట్ పొటాటో లో ఎన్నో రకాల పోషకాలు ఉండడం వల్ల వీటిని తినడం వల్ల ఆరోగ్యమే. కానీ కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు స్వీట్ పొటాటోకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఆక్సలైట్లు అనే పదార్థం ఉంటుంది. ఇది కిడ్నీలో కాల్షియం ఆక్సలైట్లు రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. స్వీట్ పొటాటోలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల.. కిడ్నీ సమస్య ఉన్నవారు దీనిని తినడం వల్ల ఇడ్లీలు సరిగా పనిచేయవు. శరీరంలో పొటాషియం నిల్వలో పెంచేలా చేస్తాయి. గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారు.. గుండె జబ్బులకు సంబంధించిన మెడిసిన్ వాడేవారు .. స్వీట్ పొటాటో తినడం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
స్వీట్ పొటాటో తినడం వల్ల త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉండదు. అందువల్ల జీర్ణ క్రియ సమస్యలు ఉండేవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. అధిక మొత్తంలో దీనిని తీసుకోవడం వల్ల ఒక్కోసారి చర్మం రంగు మారిపోవచ్చు. అయితే ఇది తీవ్రస్థాయిలో అయితే మాత్రమే. మొత్తంగా స్వీట్ పొటాటో ను ప్రత్యేకమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు మినహా అందరూ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రాసెస్ చేయకుండా నేరుగా మార్కెట్లోకి వస్తుంది. అందువల్ల ఇందులో ఉండే విటమిన్లు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి.