Coriander: వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో నాణ్యమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విటమిన్లు, ప్రోటీన్లు ఉన్న పదార్థాలను కచ్చితంగా తినాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఇంట్లో ఉన్నా వాటిని తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తుంటాం. ముఖ్యంగా రోజూ వండే కూరల్లో కొందరు కొత్తిమీర వేసుకోవడానికి ఇష్టముండదు. ఇది ప్రత్యేక స్మెల్ ను కలిగి ఉండడంతో అవైడ్ చేస్తారు. కానీ కొత్తిమీరలో ఉండే ఆరోగ్య గుణాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. అంతేకాకుండా కొత్తిమీర రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్యాలను దరి చేరకుండా చేసుకోవచ్చు. కొత్తిమీరలో ఉండే ఆరోగ్య గుణాలేంటో తెలుసుకుందాం..
కొత్తిమీరలో విటమిన్లు ఏ, బీ, సీ, కే ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, పాస్పరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు ఉంటాయి. నాన్ వెజ్ కూరల్లో కొత్తీమీర వేసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. కొత్తీమరను కూరల్లో కాకుండా నేరుగా కూడా తినోచ్చు. అంతేకాకుండా కొత్తిమీర రసం తాగడం వల్ల ఎంతో ఆరోగ్యం అని కొందరు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అయితే కొత్తి మీర తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యాలకు దూరంగా ఉంటారంటే..
కొత్తిమీరను రెగ్యులర్ గా తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కొత్తిమీర డైయూరిటిక్ గా పనిచేస్తుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల స్వెట్ ఎక్కువగా వస్తుంది. దీంతో శరీరంలోని లవణాన్ని బయటకు పంపేస్తుంది. అంతేకాకుండా చెడు కొలేస్ట్రాల్, ఎల్ డీఎల్ ఐనీ కూడా తగ్గించేందుకు సహకరిస్తుంది. అసిడిటీతో బాధపడేవారికి కొత్తమీర మంచి ఔషధంలా పనిచేస్తుంది.కణాల పెరుగుదలను నిరోధించి కేన్సర్ రాకుండా కాపాడుతుంది.
కొత్తమీర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతంది. దీంతో డయాబెటిస్ తో బాధపడేవారికి కూడా ఇది ఉపశమనంగా పనిచేస్తుంది. కొత్తిమీర గ్లూకోజ్ తో సమానం అని అంటారు. ఆహారం తీసుకునేటప్పుడు కొత్తమీర వేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన గ్లూకోజ్ ను అందించి రక్తంలో చక్కెర నిల్వలను తగ్గిస్తుంది. కొత్తమీరను ఆహారంలో నే కాకుండా రసం చేసుకొని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా తీసుకోవడం వల్ల నరాల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే మెదడు చురుగ్గా ఉండడానికి సహాయపడుతుంది.