Conocarpus Plant: మీద మెరుగు లోపల పురుగు అంటే ఇదేనేమో. వేమన ఏనాడో చెప్పాడు మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విచ్చి చూడ పురుగులుండు. అందంగా కనిపించేదాని వెనుక ఎన్నో అగాధాలుంటాయని తెలుసుకోవాలి. ఇది అన్నింటికి వర్తిస్తుంది. ఇది ఎందుకు చెప్పుకున్నామంటే ఓ మొక్క గురించి చెప్పే సందర్భంలో ఇవి చెప్పాల్సి వచ్చింది. అందంగా ఆకర్షణీయంగా ఏపుగా పెరిగే మొక్క కోనో కార్పస్. ఇది శంకు, కోన్ రూపంలో కనిపించి ఇట్టే ఆకర్షిస్తోంది. కానీ దీని వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నట్లు పర్యావరణ వేత్తలు కనుగొన్నారు. దీంతో ఈ మొక్కను పెంచే విధానంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
ఇది ఎక్కువగా ఇండియా, పాకిస్తాన్, అరబ్ దేశాలు, మధ్య ప్రాచ్య దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది అమెరికా సంతతికి చెందిన మొక్క. ఏపుగా అందంగా తొందరగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఆయా దేశాలు దీన్ని ఆకర్షించాయి. ఫలితంగా రోడ్లు, పార్కులు, అవెన్యూ ప్లాంటేషన్ ప్రాంతాల్లో విస్తృతంగా నాటారు. దీంతో అది పలు దేశాల్లో విస్తరించింది. కానీ మొదట దీంతో లాభాలు ఉన్నాయని గ్రహించినా తరువాత జరిగే నష్టం గురించే అందరు ఆందోళన చెందుతున్నారు. దీని వినియోగాన్ని ఆపాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
Also Read: Sri Lanka Crisis 2022: లంకా దహనానికి ఆ నలుగురే కారణమా?
ఈ మొక్కతో పర్యావరణానికి మేలు జరుగుతుందని, గాల్లో ఇసుక రేణువులను అడ్డుకుంటుందని భావించారు. కానీ లోతుగా అధ్యయనం చేస్తే దాని అసలు రంగు బయట పడింది. దీని వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని తేలింది. అనేక అలర్జీలకు కూడా కారణమవుతుందని శాతవాహన యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్ ఇ.నరసింహమూర్తి పరిశోధన చేశారు. దీంతో దీని వాడకంపై నిషేధం విధించారు. ఇక దీని పెంపకం చేపట్టవద్దని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోనోకార్పస్ మొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లు మంచిదనుకున్నా దాని గుట్టు తెలిసినందున దాని వినియోగం అవసరం లేదని తేల్చాయి.
ఇప్పటికే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, నర్సరీలు, పట్టణాలు, నగరాలలో విరివిగా నాటారు. దీంతో ప్రస్తుతం మాత్రం వాటిని నాటొద్దనే ఆదేశాలు రావడంతో ఇక కోనోకార్పస్ మొక్కను నాటొద్దని బలంగా నిర్ణయించారు. అందుకే వాటి వినియోగం ఉండదని తెలుస్తోంది. దాని గురించి తెలియని సమయంలో విరివిగా నాటినా ప్రస్తుతం వాటిని నాటడానికి ముందుకు రావడం లేదు. దీంతో నర్సరీల్లో పెంచినా అలాగే వదిలేయాలని చెబుతున్నారు.
మాంగ్రూన్ జాతికి చెందిన ఈ మొక్క భూగర్భంలోకి చొచ్చుకుపోతుంది. డ్రెయినేజీ, పైపులైన్, టెలికమ్యూనికేషన్ కోసం వేసిన వైర్లను సైతం పాడు చేస్తుంది. దీంతో ఈ మొక్కతో మనకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అందుకే దీని వినియోగం గురించి ఆయా దేశాలు నిషేధం విధించాయి. వీటిని నాటడం అంత శ్రేయస్కరం కాదని తేల్చాయి. దీంతో కోనోకార్పస్ మనుగడ ఇక ప్రశ్నార్థకమే. ఇంత హానికరమైన మొక్కను తెలిసి ఎవరు కూడా నాటడానికి ఇష్టపడరని తెలుస్తోంది.
అయితే ఈ మొక్కలను జనావాసాలకు దూరంగా పెంచాలి. నీటి వినియోగం తగ్గించాలి. ఇది భూమిలోకి చొచ్చుకుని పోయే మొక్క కావడంతో ఇది జనసమ్మర్థమైన ప్రాంతాల్లో నాటడం సురక్షితం కాదు. పర్యావరణ సమస్యలు కూడా వచ్చే ప్రమాదమున్నందున దీన్ని గుట్టలు, అడవులు ఉన్న ప్రాంతాల్లో నాటితేనే ఎలాంటి చిక్కు ఉండదు. తెలంగాణ ప్రభుత్వం ఈ మొక్కను పెంచొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇక దీని నాటడం చేయరాదని నిర్ణయించుకుంది.
పాకిస్తాన్ లోని కరాచీలో ఈ మొక్క పెంపకం గురించి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పర్యావరణ వేత్తలు ఈ మొక్కతో పాటు మరో 31 రకాల వృక్ష జాతులను తొలగించాలని ఆందోళన చేస్తున్నారు. కరాచీలో ఆస్తమా రోగులు ఎక్కువగా ఉన్నందున ఈ మొక్క ప్రమాదకరమని భావిస్తున్నారు. దీన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్యమం కూడా ప్రారంభమైంది. దీంతో కోనోకార్పస్ మొక్క మనుగడ ఇక కష్టసాధ్యమనే తెలుస్తోంది.
కొన్ని మొక్కల వల్ల మానవుల ఆరోగ్యం దెబ్బ తింటుందని ఇదివరకే జరిగిన పరిశోధనలు రుజువు చేశాయి. ఇప్పుడు తాజాగా కోనోకార్పస్ మొక్క కూడా మనుషుల శ్వాసపై పెను ప్రభావం చూపుతుందని ఆధారాలు కనుగొన్నారు. అందుకే దాని వినియోగం వద్దనే వాదనలు వస్తున్నాయి. దాన్ని నాటి మనుషుల ప్రాణాల మీదకు తెచ్చే బదులు దాన్ని సమూలంగా నాశనం చేయడమే మేలనే భావనలు అందరిలో కలుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోనోకార్పస్ మొక్క వల్ల కలిగే నష్టాలతో అందరు భయపడుతున్నారు. దాన్ని తీసివేయాల్సిందేననే డిమాండ్లు వస్తుండటం విశేషం.
Also Read:Venkaiah Naidu: వెంకయ్య నాయుడు ‘ఉపరాష్ట్రపతి’ పదవికి దూరం కావడం వెనుక షాకింగ్ కారణం