ATM Gold Loan: ఏటీఎం ద్వారా బంగారం పై రుణాలు తీసుకునే వీలు ఉంటే చాలా బాగుంటుంది కదా. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో 2022లో గోల్డ్ ఎటిఎం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఏటీఎం గోల్డ్ కాయిన్స్ ని ఇస్తుంది. ఆ ఏటీఎం నుంచి 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్ ని కొనుగోలు చేసుకోవచ్చు. అలాంటి మరొక ఏటీఎం ప్రస్తుతం వరంగల్ లో కూడా ప్రారంభమైంది. అయితే ఈ రెండిటికి ఒక ప్రధాన తేడా ఉంది. వరంగల్ లో ప్రారంభమైంది గోల్డ్ లోన్ ఏటీఎం. బంగారం కొద్దిగా పెట్టి లోన్ తీసుకోవాలి అనుకునే వారికి ఏటీఎం ద్వారా డబ్బులు వస్తాయి. అదికూడా కేవలం పది నుంచి 12 నిమిషాలలోనే. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ లో ఈ గోల్డ్ లోన్ ఎటిఎం నీ ప్రారంభించింది. ఈ ఏటీఎం చాలా అందంగా మరియు పూర్తిగా గోల్డ్ కలర్ లో ఉంటుంది. ఈ ఏటీఎంలో చూడడానికి చాలామంది వెళ్తున్నారు. మీరు కూడా గోల్డ్ కలర్ లో ఉండే ఈ ఏటీఎం ను చూడాలనుకుంటే కొత్త వాడలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ కి వెళ్ళాలి.
భారతదేశంలోనే మొదటిసారి ఇలాంటి ఏటీఎం ని ప్రారంభించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసేది. ఈ ఏటీఎం మనుషుల లాగానే ఆలోచిస్తుంది. మనం తనకా పెట్టాలి అనుకున్న నగలను మిషన్ బాక్స్ లో వేయగానే, అది మనిషిలాగా ఆ నగలను చూస్తుంది. ఓకే వీళ్లు నగలు ఇచ్చారు, నేను త్వరగా పని పూర్తి చేసి డబ్బులు ఇవ్వాలి అనుకుంటూ చక చక పని పూర్తి చేసేస్తుంది. నగలను ఆ ఏటీఎం బాక్స్ లో వేసిన తర్వాత ఆధార్ కార్డు నెంబర్ మరియు మొబైల్ నెంబర్ను అడుగుతుంది.
అవి ఇచ్చిన వెంటనే పని పూర్తి చేస్తుంది. పది నిమిషాల్లో ఆ ఏటీఎం నుంచి డబ్బు వస్తుంది. ఆ ఏటీఎం బాక్స్ లో నగలు వేయగానే, అది అవి బంగారమేనా, ఎన్ని క్యారెట్ లవి, ఎంత బరువున్నాయి వంటి అన్ని వివరాలు చక చకా చూస్తుంది. ఈరోజు ఇండియాలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఆన్లైన్లో చూసుకుంటుంది. ఆ ప్రకారం లెక్కలు వేసి పది నిమిషాల్లో డబ్బులు ఇస్తుంది. అయితే ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు 10 శాతం మాత్రమే ఏటీఎం ద్వారా ఇచ్చి మిగిలిన 90 శాతం డబ్బును బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తుంది.