Summer Fruits: వేసవి కాలంలో శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ ఎండలకు తట్టుకోవడం కష్టమే.దీంతో శరీరానికి చాలా నీరు అందించాలి. ఈ వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని పండ్లను తీసుకుంటే మీరు ఈ ఎండాకాలంలో సేఫ్. ఇంతకీ ఆ పండ్లు ఏంటంటే..
కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, కాల్షియం, పొటాషియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఈ కొబ్బరినీళ్లు తీసుకుంటే శరీరం ఎప్పుడూ కూడా డీహైడ్రేట్ అవకుండా కాపాడుకోవచ్చు. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. అందుకే వీటిని ఎండాకాలంలో ఎక్కువ తీసుకోవాలి.
కీరదోసలో కూడా 95 శాతం నీరే ఉంటుంది. అందుకే ఈ కీరదోసను తినడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గదు. తియ్యగా ఉండే కర్బూజ పండ్లు అందరికీ ఇష్టమే. దీనివల్ల లవణాలు అందుతాయి. ఇక వేసవి తాపం నుంచి బయటపడవచ్చు. బొప్పాయి పండ్లలో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. ఈ పండ్లను వేసవిలో తింటే వేసవిలో వచ్చే రుగ్మతల నుంచి దూరం అవవచ్చు.
స్ట్రాబెర్రీలు తింటే కూడా శరీరం డీహైడ్రేట్ అవదు. దీనివల్ల వేసవిలో కావలసిన నీరు అందుతుంది. అలసట ఉండదు.ఇప్పుడు చెప్పుకోబోయే పండు పేరు వింటే నోరు ఊరుతుంది. ఎందుకంటే అది మ్యాంగో కాబట్టి..మ్యాంగో తినడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ప్రేగు వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా అది మేలు చేస్తుంది.