Summer Food Tips: వేసవి కాలం వచ్చేసింది. కాలానుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తంగా ఉంటేనే మంచిది. లేదంటే రోగాల బారిన పడే అవకాశముంటుంది. వేసవిలో ఐస్ క్రీం, జంకుఫుడ్స్, టీ, కాఫీ, మసాలాలు తదితర వాటికి దూరంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే మందగిస్తుంది. ఫలితంగా కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే నిపుణుల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. మన ఆరోగ్య సంరక్షణకు మనమే శ్రద్ధ తీసుకోవాలి.

ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోకపోతే రోగాల బారిన పడటం ఖాయమే. అందుకే వేసవిలో విరివిగా లభించే పండ్లు తింటే ఆరోగ్యం బాగుంటుంది. కానీ ప్రస్తుతం దొరికే మామిడిపండ్లు ఎక్కువగా తీసుకోకూడదు. దాని వల్ల వేడి చేస్తుంది. ఇందులో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే సూచనలున్నాయి. దీంతో అజీర్తి, విరేచనాలు వంటి సమస్యలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అందువల్ల మితంగా తింటేనే మేలు.
Also Read: Dissent In Telangana Congress: కాంగ్రెస్ అసమ్మతి నేతలకు చెక్.. పట్టుబిగించిన రేవంత్ రెడ్డి
ఇక ఈ సీజన్ లో జంకుఫుడ్ కు దూరంగా ఉంటేనే శ్రేయస్కరం. ఎందుకంటే వీటి వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మందగించే సూచనలున్నాయి. దీంతో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. వేసవిలో వీటిని తీసుకుంటే ప్రమాదకరమే అని గ్రహించుకోవాలి. వేసవిలో చెమట రూపంలో వేడి బయటకు వెళ్లిపోతోంది. జంకుఫుడ్ ను తీసుకోవటం మంచిది కాదు.
మసాలను కూడా వాడకూడదు. వాటి వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. తద్వారా ఇతర రోగాలకు కారణమవుతుంది. మసాలాలు శరీరంలో తొందరగా జీర్ణం కావనే సంగతి తెలుసుకుంటేనే మనకు అవస్థలు రావు. ఇంకా ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ వంటి వాటి జోలికి వెళ్లకూడదు. వీటితో ఉపద్రవం వస్తుంది. టీ, కాఫీలు కూడా తీసుకోవడం తగదు. వీటితో కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ మంచి ఆహారాన్ని తీసుకుని ఆరోగ్య జీవనానికి అందరు నిర్ణయం తీసుకోవాల్సిందే.
Recommended Video: