Summer Drinks: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు ముదిరాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో అందరు భయపడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి వెనకడుగు వేస్తన్నారు. దీంతో ఎండలకు బెంబేలెత్తిపోతున్నారు. ఎండలో బయటకు వెళితే వడదెబ్బ ముప్పు ఏర్పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టమే. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలుంటున్నాయి. ఈ నేపథ్యంలో మనం వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి ఎలాంటి ద్రావణాలు తీసుకోవాలో చూద్దాం.
చెరుకురసం
వేసవి కాలంలో మనకు చల్లదనం అందించడంలో చెరుకు రసం ప్రధానమైనది. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్లు, మెగ్నిషియం, కాల్షియం శరీరానికి శక్తిని ఇవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే చెరుకురసం తాగడం ఉత్తమం. మూత్ర సంబంధ వ్యాధులకు కూడా చెక్ పెడుతుంది. ఇందులో ఉండే లవణాలు మనకు ఉపయోగపడతాయి. అందుకే చెరుకురసం తీసుకోవడం వల్ల వడదెబ్బ ముప్పు ఉండదని గుర్తించుకోవాలి.
మజ్జిగ
వేసవి కాలంలో ఎక్కువగా తాగేది మజ్జిగ. పెరుగుకంటే మజ్జిగనే బెటర్. ఇది శరీరాన్ని డీ హైడ్రేడ్ కాకుండా చేస్తుంది. వడదెబ్బ తాకకుండా నిరోధిస్తుంది. దీంతో మజ్జిగలో కాస్త ఉప్పు, చిటికెడు వేయించిన వాము, చిన్న అల్లం ముక్క, రెండు నిమ్మ ఆకులు వేసుకుని తాగితే మంచి రుచిగా ఉంటుంది. దీంతో మనకు వడదెబ్బ తగలకుండా సాయపడుతుంది.
సబ్జాగింజలు
వేసవిలో చల్లదనాన్ని ఇచ్చేవి సబ్జ గింజలు. నీళ్లలో వీటిని వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. దీన్ని రోజు తాగుతుంటే ప్రొటీన్ అందుతుంది. శరీరానికి పోషకాలు మెండుగా అందుతాయి. ఎండాకాలంలో వడదెబ్బ కామన్. దీంతో దాని బారి నుంచి కాపాడుకోవాలంటే ఇలాంటి ద్రావణాలు తీసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో ఈ ద్రావణాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కొబ్బరినీళ్లు
వేసవిలో కొబ్బరినీళ్లు తియ్యగా ఉంటాయి. దీంతో వీటిని తాగేందుకు జనం ఎక్కువగా ఇష్టపడతారు. కొబ్బరినీళ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. పొటాషియం, సోడియం ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వేసవిలో వీటిని తీసుకోవడం ఎంతో మంచిది. ఇందులో పిండి పదార్థాలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో కొబ్బరిబొండాం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది.