Periods: ఈ మధ్య కాలంలో మహిళల్లో చాలామంది నెలసరి సమయానికి రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారనే సంగతి తెలిసిందే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను చాలామంది చిన్న సమస్యే అని భావించినా ఈ సమస్య వల్ల మహిళలు దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నెలసరి సమయానికి రాకపోవడానికి రక్తహీనత కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది.
తరచూ నెలసరి మిస్ అవుతుంటే వైద్యులను సంప్రదించి అందుకు తగిన కారణాలను తెలుసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మహిళా క్రీడాకారులను ఈ సమస్యలు వేధించే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. 30 రోజుల నుంచి 44 రోజుల లోపు పీరియడ్ వస్తే దానిని లేట్ పీరియడ్ గా భావించాల్సి ఉంటుంది. రక్తహీనత వస్తే నెలసరి ఆలస్యమవుతుంటే సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు.
పేగులకు సంబంధించిన సమస్యలు ఉన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా నెలసరికి సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. యూరినరీ ఇన్ఫెక్షన్లు, కుటుంబ నియంత్రణ కోసం మందులు వాడే మహిళలలో సైతం నెలసరికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మానసిక సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో నెలసరి సమస్యలకు కారణమవుతాయి.
నెలసరి లక్షణాలు కనిపించి నెలసరి రాకపోయినా కూడా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం కూడా నెలసరి సమస్యలకు కారణమవుతుంది. సరైన సమయంలో సమస్యను గుర్తించడం ద్వారా మాత్రమే మహిళలు సమస్యలను అధిగమించవచ్చు.