https://oktelugu.com/

Prabhas: RRR మూవీ చూసి ఘోరంగా ఏడ్చేసాను

Prabhas: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..బాక్స్ ఆఫీస్ పరంగా ఈ సినిమా ఎన్ని అద్భుతాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని బాహుబలి మరియు దంగల్ వంటి సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్ టైం టాప్ 3 ఇండియన్ సినిమా గా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇక ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 17, 2022 / 05:17 PM IST
    Follow us on

    Prabhas: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..బాక్స్ ఆఫీస్ పరంగా ఈ సినిమా ఎన్ని అద్భుతాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని బాహుబలి మరియు దంగల్ వంటి సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్ టైం టాప్ 3 ఇండియన్ సినిమా గా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇక ఈ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో తెలిసిందే..వీళ్లిద్దరి నటనని దేశ వ్యాప్తంగా మెచ్చుకోని వాడు అంటూ ఎవ్వడు మిగలలేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు..క్రిటిక్స్ నుండి సెలబ్రిటీస్ వరుకు వీళ్లిద్దరి నటన పై ప్రశంసల వర్షం కురిపించారు..ఇక ఇటీవలే ఈ సినిమాని యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేకమైన స్క్రీనింగ్ ద్వారా ఈ సినిమా ని వీక్షించారు..సినిమా చూసిన తర్వాత ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

    Prabhas

    ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా ఘన విజయం సాధించినందుకు నాకు చాలా ఆనందం గా ఉంది..ఇన్ని రోజులు షూటింగ్ లో ఉండడం వల్ల ఈ సినిమాని కాస్త ఆలస్యం గా చూసాను..తారక్ మరియు చరణ్ ఇద్దరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్..వాళ్ళిద్దరిని అలా ఒక్కే తెరపై చూస్తూ ఉంటె నాకు చాలా గొప్పగా అనిపించింది..రాజమౌళి గారు వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించారు..కొన్ని సన్నివేశాలకు నాకు తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు తిరిగేసాయి..రాజమౌళి గారిని మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్ అని అందరూ ఊరికే అనరు..ఇద్దరి స్టార్ హీరోలను సమానంగా బాలన్స్ చేస్తూ తియ్యడం అంటే మాములు విషయం కాదు..రాజమౌళి గారు తప్ప ఎవ్వరు ఈ స్థాయిలో ఒక్క మల్టీస్టార్ర్ర్ ని ఏ దర్శకుడు కూడా తియ్యలేరు అని మాత్రం గట్టిగా చెప్పగలను..ముఖ్యంగా చరణ్ ఎంట్రీ మరియు తారక్ ఎంట్రీ సన్నివేశాలకు నాకు గూస్ బంప్స్ వచ్చాయి..చరణ్ ఎంట్రీ సీన్ చిత్రీకరణని నేను లైవ్ గా షూటింగ్ లో చూసాను..అద్భుతమైన అనుభవం కలిగింది..మరోసారి ఈ సినిమా ఘన విజయం సాధించినందుకు మూవీ యూనిట్ మొత్తానికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.

    Also Read: Love Marriage: ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన యువకుడు.. ఏం చేశాడంటే?

    Prabhas

    ఇక ఈ సినిమా ఇప్పటికి కూడా విజయవంతంగా థియేటర్స్ లో నడుస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికే అన్ని భాషలకు కలిపి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయిలు వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా ఇప్పటికే 270 కోట్ల రూపాయిల షేర్ మరియు 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి బాహుబలి పార్ట్ 2 వసూళ్లను దాటి, సరికొత్త ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది నిలిచింది..కానీ మిగిలిన ఏ ప్రాంతం లో కూడా ఈ సినిమా బాహుబలి పార్ట్ 2 వసూళ్లను అందుకోలేదు అనే చెప్పాలి..ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే బాహుబలి పార్ట్ 2 మూవీ రన్ ఒక్క సునామి అనే చెప్పాలి, కేవలం హిందీ వెర్షన్ నుండి ఈ సినిమా దాదాపుగా 600 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చెయ్యగా , #RRR మూవీ మాత్రం ఇప్పటి వరుకు కేవలం 250 కోట్ల రూపాయిల నెట్ ని మాత్రమే వసూలు చేసింది..ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ వస్తూ ఉండడం తో ఈ సినిమా క్లోసింగ్ టైం కి 270 కోట్ల రూపాయిల మార్కుని అందుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమా 1200 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యగా బాహుబలి పార్ట్ 2 మాత్రం 1800 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఈ రికార్డును #RRR మూవీ అందుకోవడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.

    Also Read:RRR Movie Box Office Collection: ఇంకా త‌గ్గ‌ని ఆర్ఆర్ఆర్ క్రేజ్‌.. 23వ రోజు రికార్డు క‌లెక్ష‌న్లు.. మొత్తంగా ఎంత లాభ‌మంటే..?

    Tags