https://oktelugu.com/

Sri Rama Navami: శ్రీరామనవమి రోజున నైవేద్యంగా పానకం, వడపప్పు ఎందుకు పెడతారో తెలుసా?

Sri Rama Navami: హిందువులు ఘనంగా జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటనే సంగతి తెలిసిందే. ఈ పండుగ రోజున దేవుడికి నైవేద్యంగా పానకం, వడపప్పు పెడతారనే సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రసాదాలనే నైవేద్యంగా పెట్టడం వెనుక ముఖ్య కారణాలు ఉన్నాయి. ఈ ప్రసాదాలను తీసుకోవడం వల్ల మనకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. సాధారణంగా శ్రీరామనవమి పండుగ వేసవికాలంప్రారంభంలో వస్తుంది. శ్రీరామనవమి పండుగ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉండటం గమనార్హం. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 10, 2022 / 08:56 AM IST
    Follow us on

    Sri Rama Navami: హిందువులు ఘనంగా జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటనే సంగతి తెలిసిందే. ఈ పండుగ రోజున దేవుడికి నైవేద్యంగా పానకం, వడపప్పు పెడతారనే సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రసాదాలనే నైవేద్యంగా పెట్టడం వెనుక ముఖ్య కారణాలు ఉన్నాయి. ఈ ప్రసాదాలను తీసుకోవడం వల్ల మనకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. సాధారణంగా శ్రీరామనవమి పండుగ వేసవికాలంప్రారంభంలో వస్తుంది.

    శ్రీరామనవమి పండుగ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉండటం గమనార్హం. దేవునికి నైవేద్యంగా పెట్టే పానకం తయారీ కోసం మిరియాలు, ఏలకులు వినియోగిస్తారు. సాధారణంగా వసంత ఋతువులో ఎక్కువగా గొంతు సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మిరియాలు, యాలకులతో చేసిన ఈ పానకంను తీసుకోవడం ద్వారా గొంతు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

    శ్రీ మహావిష్ణువుకు పానకం ఎంతో ప్రీతికరమైనది అనే సంగతి తెలిసిందే. శరీరంలో వేడిని తగ్గించడంలో పెసరపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెసరపప్పు వల్ల జీర్ణశక్తి పెరగడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పెసరపప్పునే వడపప్పు అని కూడా పిలుస్తారు. వేసవికాలంలో వడదెబ్బ బారిన పడకుండా చేయడంలో వడపప్పు తోడ్పడుతుంది.

    వడపప్పును తినడం వల్ల బుధుని అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి పండుగను జరుపుకునే వాళ్లు దేవునికి నైవేద్యంగా వీటిని సమర్పిస్తే మంచిది. పానకం, వడపప్పులను సులభంగానే తయారు చేసుకోవచ్చు.