Kidney Stones Diet: ఇటీవల కాలంలో కిడ్నీల సమస్యలు పెరుగుతున్నాయి. వయసుతో సంబందం లేకుండా మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. మనం తినే ఆహారాలతోనే మన ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినా మన పద్ధతులు మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కిడ్నీల పనితీరు మందగిస్తోంది. ఫలితంగా ప్రస్తుతం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో నొప్పి తీవ్రంగా ఉంటోంది. ఏ పనిచేయాలన్నా వీలు కాదు.
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినప్పుడు మనం కొన్ని చిట్కాలు పాటిస్తుంటాం. కొందరు డాక్టర్లు ఈత కల్లు తాగాలని చెబుతారు. మరికొందరు ఇంకా ఏవేవో సూచిస్తుంటారు. మూత్ర పిండాల్లో రాళ్లు వచ్చినప్పుడు చల్ల గింజలు బాగా పనిచేస్తాయి. వీటితో మనం మూత్రపిండాల్లో రాళ్లను తొలగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో మూత్రపిండాల్లో రాళ్లను తొలగించుకునేందుకు చల్ల గింజలు మంచి ప్రయోజనాలు కలిగిస్తాయి.
వీటిని ఎలా ఉపయోగించుకోవాలంటే ఒక బాటిల్ లో కొన్ని చిల్ల గింజలు వేసుకుని గిలక్కొట్టాలి. దీని వల్ల ఆ గింజల్లో ఉండే సారం నీళ్లలోకి చేరుతుంది. దీని వల్ల కిడ్నీల్లో రాళ్లు పోవడానికి దోహదపుతుంది. మూత్రం కూడా ధారగా పోవడానికి కారణమవుతుంది. ఈ క్రమంలో కిడ్నీల్లో రాళ్లు పోవడానికి ఇదే మంచి చిట్కా. దీంతో ఈ నీరు అలాగే తాగుతుండాలి.
దీని వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. చిల్ల గింజలు బాటిల్లో వేసుకుని దాహం వేసినప్పుడల్లా నీళ్లు పోసుకుని గిలక్కొట్టుకుని తాగుతుంటే ఫలితం ఉంటుంది. ఇది సులభమైన చిట్కాయే. కానీ చక్కగా ఆచరిస్తే ఫలితం దక్కుతుంది. దీంతో చిల్ల గింజలు మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని వాడుకుని మన మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను తొలగించుకోవచ్చు.