Fenugreek : మెంతులతో ఇన్ని లాభాలా? మెంతుల మొలకలతో మరిన్ని ప్రయోజనాలు….

మెంతి గింజలను ఆంగ్లంలో fenugreek Seeds అంటారు. మెంతి గింజల వాడకం బరువు తగ్గించడంలో, పొట్టను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. మెంతి గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల చాలా కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మళ్లీ మళ్లీ ఆకలి అనిపించదు. పీచుతో పాటు, మెంతి గింజల్లో మంచి మొత్తంలో రాగి, రిబోఫ్లావిన్, విటమిన్ ఎ, బి6, సి, కె, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఇవి శరీరానికి లోపల నుండి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మెంతి గింజలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

Written By: Swathi Chilukuri, Updated On : October 24, 2024 12:19 pm

So many benefits with Fenugreek? More Benefits with Fenugreek Sprouts….

Follow us on

Fenugreek :మెంతి గింజలు నీరు: మెంతి గింజలను తినడానికి ఉత్తమ మార్గం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే రాత్రిపూట ఒక గ్లాసులో 1 నుంచి 2 స్పూన్ల మెంతులు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం అందులోని  నీటిని కొద్దిగా  వడపోయాలి. ఇలా చేసిన తర్వాత ఆ నీటిని తాగాలి. నచ్చితే మీరు నానబెట్టిన మెంతి గింజలను తినవచ్చు. ఈ గింజలతో ఫేస్ ప్యాక్ లేదా హెయిర్ మాస్క్ తయారు చేసి అప్లై చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

మెంతి గింజల నీటిని తాగితే జీవక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలోని అదనపు కొవ్వు కాలిపోతుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ నీళ్లలో ఎన్నో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి చాలా బెనిఫిట్ ను అందిస్తాయి.

మెంతి గింజల టీ: మెంతి గింజల నీరు మాత్రమే కాదు మెంతి గింజల నుంచి టీ కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలంటే.. మెంతులను ఒక పాత్రలో వేసి నీటిలో బాగా మరిగించాలి. నీరు మరిగిన తర్వాత దాన్ని ఒక కప్పులో ఫిల్టర్ చేసుకోవాలి. ఈ టీ తాగితే ఎక్కువ ఆకలి అనిపించదు. పదే పదే ఏదైనా తినాలి అనిపిస్తుంది. మెంతి గింజల టీని ఉదయం లేదా సాయంత్రం తాగవచ్చు.

మెంతి గింజల మొలకల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విటమిన్ సితో పాటు విటమిన్ ఎ, బి కూడా ఇందులో ఉంటాయి. అంతేకాకుండా, మొలకెత్తిన మెంతులు ప్రోటీన్, కాల్షియం, ఫైబర్‌తోపాటు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.

వీటిని కంటిన్యూగా తీసుకుంటే బ్లడ్ షుగర్ అదుపులో ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో ఉండే పీచు పొట్టను మృదువుగా ఉంచుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్ ప్రభావాలు స్త్రీపురుషుల హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. మెనోపాజ్, పిఎంఎస్‌తో బాధపడుతున్న మహిళలకు ఈ మొలకలు చాలా ప్రయోజనాలను అందిస్తాయి.