Sleeping: చాలా మందికి చీకటి ఉంటే అసలు మైండ్ పనిచేయదు. ఇక నిద్ర కూడా పట్టదు కొందరికి. చీకట్లో భయపడేవారే ఎక్కువ ఉంటారు. అందుకే లైట్లను అసలు ఆఫ్ చేసుకోరు. చదువు, ఫోన్, భయం అంటూ చాలా మంది లైట్ కిందనే ఉంటారు. రాత్రి పదకొండు అయినా సరే బెడ్ రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంటుంది. మరి లైట్ కింద పడుకోవాలా? లైట్ లేకుండా పడుకోవాలా అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే లైట్ ఉండటం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలిస్తే అసలు లైట్ వేసుకోరు. లైట్ ఉంటే భయపడతారు. మరి ఎందుకో తెలుసుకోండి.
తరచుగా అర్థరాత్రి వరకు పని చేసేవారు, చదువుకునే వారు అర్థరాత్రి వరకు గదిలోని లైట్లను వేసుకునే ఉంటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. రాత్రిపూట లైట్ ఆన్ చేసి పడుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెబుతుంది ఓ అధ్యయనం. మరీ ముఖ్యంగా టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. రాత్రిపూట నిద్రపోవడం మీ మధుమేహ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వెల్లడించింది జూన్ 2024లో ప్రచురించిన అధ్యయనం. అదేంటంటే..
ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆండ్రూ ఫిలిప్స్ లైట్ వేసుకొని పడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిపారు. రాత్రిపూట ప్రకాశవంతమైన కాంతికి గురికావడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని అధ్యయనంలో తేలిందట.
రాత్రిపూట కాంతికి ఎక్కువగా గురికావడం వల్ల సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలుగుతుందని.. ఇన్సులిన్ స్రావం, గ్లూకోజ్ మెటబాలిజంలో మార్పులు సంభవిస్తాయి అన్నారు ప్రొఫెసర్. ఈ మార్పులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయట.. ఇది చివరికి టైప్ 2 మధుమేహానికి దారితీస్తుందట.
మధ్యాహ్నం 12:30, ఉదయం 6 గంటల మధ్య కాంతికి గురికావడం వల్ల మధుమేహం వస్తుందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్నారు. పరిశోధకులు సుమారు 85 వేల మంది.. 13 మిలియన్ గంటల లైట్ సెన్సార్ డేటా నుంచి సమాచారాన్ని విశ్లేషించారట. అధ్యయనం ప్రారంభించినప్పుడు వీరికి ఎవరికి కూడా టైప్ 2 డయాబెటీస్ లేదట. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని పరిశీలించారట పరిశోధకులు. ఈ అధ్యయనం ఏకంగా తొమ్మిది సంవత్సరాలు కొనసాగిందట. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని అధ్యయనాల్లో ఇది అతి పెద్ద అధ్యయనం అంటున్నారు.
రాత్రిపూట ప్రకాశవంతమైన కాంతికి గురికావడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపాయట ఫలితాలు. కాంతి బహిర్గతం, ప్రమాదం మధ్య మోతాదు-ఆధారిత సంబంధం కనుగొన్నారు పరిశోధకులు. రాత్రిపూట కాంతికి లైట్ కింద ఉండటం, లైట్ కింద పని చేయడం. నిద్ర పోయే సమయంలో చీకటిగా లైట్ వేసుకోవడం వంటివి చేయకూడదు. అందుకే నిద్రించేటప్పుడు లైట్ ఆఫ్ చేయాలి అంటున్నారు పరిశోధకులు.
అయినా కొందరికి కళ్లు కనిపించకపోయినా కూడా ప్రపంచాన్ని చూడగలుగుతారు. అలాంటిది కేవలం నైట్ లైట్ లేకపోతే ఏం అవుతుంది చెప్పండి. అందుకే నైట్ అయినా కాస్త లైట్ ఆఫ్ చేసి పడుకోండి. బెడ్ పక్కనే స్విచ్ లు కూడా ఉంటాయి కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవసరం అయితే లైట్ వేసుకొని మీరు బయటకు కూడా వెళ్లవచ్చు. ఇక కొందరికి లైట్ ఉంటే అసలు నిద్ర పట్టదు. మీరు అదృష్టవంతులు. కానీ కొందరికి లైట్ ఆఫ్ చేస్తే అసలు నిద్రపట్టదు. కానీ మీరు అలవాటు చేసుకోవాల్సిందే. లేదంటే సమస్యల్లో పడతారు. జాగ్రత్త.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Sleeping with the light on very dangerous
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com