Sleep Tips: ప్రతి మనిషికి ప్రతి రోజు 8 గంటల నిద్ర అవసరం అని వైద్యులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత కాలంలో రకరకాల కారణాలవల్ల అనేక ఒత్తిడి లను ఎదుర్కొంటున్నారు. దీంతో సరైన నిద్ర పోవడం లేదు. అయితే కొందరు సమయాన్ని కల్పించుకొని కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నిద్రపోవడానికి అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల కూడా కంటి నిండా నిద్రపోకుండా ఉంటారు. నిద్రపోవడానికి అనుకూలమైన వాతావరణంలో ప్రధానంగా బెట్టుపై ఉండే పరుపు గురించి తెలుసుకోవాలి. సాధారణంగా కొందరు ఒకసారి పరుపులు కొనుగోలు చేస్తే వాటిని జీవితాంతం వాడాలని అనుకుంటారు. కానీ వీటిని ఎక్కువ రోజులు వాడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలు పరుపులు ఎన్ని రోజులు వాడాలి? అంతకుమించితే ఎలాంటి సమస్యలు వస్తాయి?
Also Read: ఉగ్రదాడిలో వీరోచితం.. 11 మంది పర్యాటకులను కాపాడిన కశ్మీరీ వ్యాపారి సాహసం
ప్రతి మూడేళ్లకు ఒకసారి పరుపులు మార్చడం మంచిది అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఉండే స్పంది లేదా కొబ్బరి పీచు అనేది గట్టిగా మారిపోతుంది. ఇలా మారడం వల్ల పడుకునే వారి అసౌకర్యంగా మారిపోతారు. అంతేకాకుండా సరైన నిద్ర పట్టక అవస్థలు పడతారు. ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి పరుపులను అస్సలు వాడకుండా చూడాలి. లేకుంటే వారు సరైన నిద్రపోకుండా అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది.
పరుపులు సరిగా లేకపోవడం వల్ల సరైన నిద్ర రాదు. అంతేకాకుండా వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎక్కువ రోజులు వాడిన పరుపులు ఎగుడు దిగుడుగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఇది వెన్నుపూసపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా మెడలపై కూడా ప్రభావం పడి తీవ్ర నొప్పి వస్తుంది. ఈ నొప్పికి కొన్నాళ్లపాటు ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు వాడినా కడుపులో దుమ్ము ధూళి ఎక్కువగా చేరుతుంది. ఇలాంటి పరుపుల పై తల ఆనిచ్చి పడుకుంటూ ఉంటాం. వీటిపై ఉండే దుమ్ము ధూళి నేరుగా ముక్కులో నుంచి శ్వాస నాళాల్లోకి చేరే అవకాశం ఉంది. ఇలా చేరిన తర్వాత శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఎక్కువ రోజులు వాడిన పరుపులు వల్ల మెడ నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఈ పరుపులు గట్టితనంగా మారి రక్తప్రసరణ కాకుండా అడ్డుకుంటుంది. అయితే ఈ పరుపులు కొబ్బరి పీచుతో తయారైనవి అయితే మరిన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంది. స్పంచితో ఉన్న పరుపులు సైతం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పిల్లల విషయంలో అరుపులు ప్రతి మూడేళ్లకు ఒకసారి మారుస్తూ ఉండాలి. లేదా వారికి ప్రత్యేకంగా పరుపులు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే వారు కండరాలు, మెడ సమస్యలు ఏర్పడడంతో చదువుపై దృష్టి సారించలేరు. అంతేకాకుండా మెడ నొప్పితో తీవ్రంగా బాధపడే అవకాశం ఉంది. అందువల్ల పరుపులను ఎక్కువ రోజులు వాడకుండా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా నాణ్యమైన పరుపులు తీసుకునే ప్రయత్నం చేయాలి.