Sleep Drinks: మంచి ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది సరైన నిద్ర పోవడం లేదు. రోజువారి పనులు లేదా ఇతర కారణాలవల్ల రాత్రులు నిద్ర పట్టక సంపూర్ణ నిద్రపోవడం లేదు. అయితే నిద్రలేమిటో అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిద్ర లేకపోవడం వల్ల మానసికంగా మాత్రమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకుండా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది చెబుతున్న విషయం ఏంటంటే.. అనేక కారణాలవల్ల రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టడం లేదని.. ఇలాంటి సమయంలో కొన్ని పానీయాలు తీసుకోవడం వల్ల వెంటనే నిద్ర వచ్చే అవకాశం ఉంది. అలాంటి పానీయాలు ఇప్పుడు చూద్దాం..
నిద్రపోయే ముందు పాలు తీసుకోవాలి. పాలలో ఉండే పోషకాల వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది. దీంతో మానసికంగా సంతృప్తిగా ఉండి తొందరగా నిద్రపోతారు. అయితే ఈ పాలు గోరువెచ్చగా ఉండి అందులో కాస్త పసుపు వేయడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ప్రతిరోజు చాలామంది రకరకాల విషయాలతో ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ ఆందోళన కారణంగా తొందరగా నిద్ర పట్టి అవకాశం ఉండదు. ఇలాంటి సమయంలో అశ్వగంధం కలిపిన టీ ని తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా ఎలాంటి అలజడు లు ఉన్నా కూడా మాయమైపోతాయి. ఆ తర్వాత హాయిగా నిద్రపోతారు.
మానవ శరీర ఆరోగ్యానికి బాదం పాలు ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా పాదం గింజల్లో మెగ్నీషియం, ఫైబర్, విటమిన్లు చాలా వరకు ఉంటాయి. ఇవి మెదడుకు విశ్రాంతిని కలుగజేస్తాయి. రాత్రి సమయంలో బాదంపాలు తీసుకోవడం వల్ల శరీరం ఉల్లాసంగా మారి మంచి నిద్రకు కారణం అవుతుంది. అందువల్ల ప్రతిరోజు నిద్రపోయే ముందు బాదంపాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కొబ్బరి నీళ్లు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. వేసవికాలంలో శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి. అయితే మానసికంగా ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలోనూ ఇది సహకరిస్తాయి. ఈ సమస్యలు ఉన్నవారు నిద్రపోయే ముందు కొబ్బరినీళ్లు తాగడం వల్ల మానసికంగా ప్రశాంతంగా మారి సంతృప్తిగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.
సాయంత్రం సమయంలో కెఫిన్ తో కూడిన టీ తాగడం చాలా హానికరం. కానీ ఇదే సమయంలో పుదీనా ఆకులతో తయారైన టీని తాగడం ఎంతో మేలు. ఈ టీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి మటుమాయమవుతుంది. దీంతో హాయిగా నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో లావెండర్ ఎంతో ఉపయోగపడుతుంది. దీని ఆకులతో టీ తయారు చేసుకొని సాయంత్రం సమయంలో తాగడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు వీటిని తాగొచ్చు.
అయితే ఈ పానీయాలు నిద్రపోయే గంటముందు తాగడం మేలు. అంతేకాకుండా ఇందులో ఎక్కువగా షుగర్ కాకుండా లేదా కెఫిన్ కలపకుండా తీసుకోవడం మంచిది.