Skin: అమ్మాయిలు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మెరవడానికి ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటంతో పాటు చిన్న చిన్న సహజ చిట్కాలు కూడా పాటిస్తుంటారు. అయితే అందంగా కనిపించాలంటే కేవలం ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడితే సరిపోదు. ఆహారంలో కూడా కొన్ని రకాల పదార్థాలు చేర్చుకోవాలి. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏదో విధంగా డైలీ పోషకాలు ఉండే ఆహారాలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. చాలా మంది ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడి చర్మ సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. అయితే చర్మం అందంగా ఉండి, ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే స్నానం చేసేటప్పుడు వాటర్‌లో కొన్ని వస్తువులు కలపాలి. అవేంటో మరి తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
వేపాకులు
వేపాకులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కేవలం చర్మాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఉపయోగపడతాయి. వేపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని కలిగించవు. ఇవి చర్మంపై ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. బాత్ వాటర్‌లో వేపాకులు వేసి స్నానం చేస్తే చర్మ సమస్యలు అన్ని తొలగిపోతాయి. అలాగే చర్మంపై ఎలాంటి బ్యాక్టీరియా అయిన కూడా క్లియర్ అవుతుంది. చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు కూడా తొలగిపోతాయి. రోజూ వేపాకులతో స్నానం చేయకపోయిన కనీసం వారానికి రెండు నుంచి మూడు సార్లు అయిన చేయడం మంచిది.
కళ్లు ఉప్పు
బాత్ వాటర్‌లో కొంచెం కళ్లు ఉప్పుు వేయడం వల్ల చర్మంపై ఉండే మచ్చలు అన్ని తొలగిపోతాయి. ఇందులోని ఖనిజాలు చర్మానికి కావాల్సిన అన్నింటిని అందిస్తాయి. అలాగే చర్మంపై ఉండే ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి. తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడతాయి. ఇవే కాకుండా ఆర్థరైటిస్, కీళ్ల సమస్యల నుంచి కూడా కళ్లు ఉప్పు బాగా సాయపడుతుంది.
తులసి ఆకులు
ఆయుర్వేదంలో తులసికి చాలా ప్రత్యేకత ఉంది. తులసి మొక్క ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ ఆకులను బకెట్ వాటర్‌లో వేసి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోవడంతో పాటు పాజిటివిటీ కూడా పెరుగుతుంది. అలాగే మానసిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి.
పసుపు
యాంటీ బయోటిక్ అయిన పసుపు చర్మ సమస్యలకు బాగా పనిచేస్తుంది. దీంతో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇందులోని పోషకాలు ఎలాంటి చర్మ సమస్యలు దరిచేరనివ్వకుండా కాపాడతాయి. పసుపును బకెట్ వాటర్‌లో వేసి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.