
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలోని చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేశాయి. దీంతో ఉద్యోగులు ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ఇంటి నుండే పని చేస్తున్నారు. అయితే ఎక్కువ సమయం ఇంట్లో కూర్చుని పని చేస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే పనిగా కూర్చుని పని చేసేవాళ్లు డయాబెటిస్ బారిన పడుతున్నారని తమ పరిశోధనల్లో తేలిందని వెల్లడిస్తున్నారు.
చాలా కంపెనీలు ఉద్యోగులకు సాధారణంగా ఇచ్చే వర్క్ కంటే ఎక్కువ వర్క్ ను ఇస్తున్నాయి. అందువల్ల ఉద్యోగులు ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కువ సమయం ఒకే ప్లేస్ లో కూర్చోవడం వల్ల శరీరానికి వ్యాయామం ఉండదు. శాస్త్రవేత్తలు 45 మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాలు వెల్లడించారు. రెండు వారాల పాటు వారి అలవాట్లను శాస్త్రవేత్తలు పరిశీలించారు.
శాస్త్రవేత్తలు ఎవరైతే శారీరక వ్యాయామం లేకుండా ఎక్కువ సమయం పని చేస్తారో వారిలో కొవ్వు శాతం పెరుగుతుందని కొని లక్షణాలను బట్టి డయాబెటిస్ ను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. తరచూ మూత్రం రావడం ఎక్కువగా దాహం వేయడం, గొంతు ఎండిపోతున్నట్లు అనిపించడం, చూపు మందగించడం, చిగుళ్ల సంబంధిత సమస్యలు ఉంటే డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది.
ఎవరైతే డయాబెటిస్ బారిన పడతారో వారికి ఆకలి ఎక్కువగా వేయడంతో పాటు గాయాలు త్వరగా మానవు. ఒకే చోట కూర్చోకుండా తరచూ అటూఇటూ తిరగడం, చిన్నచిన్న వ్యాయామాలు చేయడం, రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం ద్వారా డయాబెటిస్ రిస్క్ ను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.