Mrigasira Karthi: నేడే మృగశిర.. ఈ కార్తె ప్రాముఖ్యత ఏమిటీ? ఆ పేరు ఎందుకొచ్చింది?

Mrigasira Karthi: భారతదేశ సంప్రదాయం ప్రకారం మనకు ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ప్రకృతితో పెనవేసుకున్న సంబంధాలే ఎక్కువగా ఉంటాయి. సంక్రాంతి పండగను మనం పంట చేతికొచ్చే సమయంలో జరుపుకోవడం ఆనవాయితీ. చాంద్రమానం ప్రకారం చంద్రుడు ఒక్కో నక్షత్రంలో 15 రోజులు ఉంటాడు. అలా మనకు 27 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నుంచి మొదలు రేవతి వరకు నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మృగశిర కార్తెకు కూడా ఓ సందర్భం ఉంది. వర్షాలు ప్రారంభమయ్యే కాలం కావడంతో వాతావరణం […]

Written By: Srinivas, Updated On : June 8, 2022 9:53 am
Follow us on

Mrigasira Karthi: భారతదేశ సంప్రదాయం ప్రకారం మనకు ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ప్రకృతితో పెనవేసుకున్న సంబంధాలే ఎక్కువగా ఉంటాయి. సంక్రాంతి పండగను మనం పంట చేతికొచ్చే సమయంలో జరుపుకోవడం ఆనవాయితీ. చాంద్రమానం ప్రకారం చంద్రుడు ఒక్కో నక్షత్రంలో 15 రోజులు ఉంటాడు. అలా మనకు 27 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నుంచి మొదలు రేవతి వరకు నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మృగశిర కార్తెకు కూడా ఓ సందర్భం ఉంది. వర్షాలు ప్రారంభమయ్యే కాలం కావడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది.

Mrigasira Karthi

మృగశిర కార్తె అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే మృగశిర నక్షత్రంలో చంద్రుడు సంచారం చేస్తున్నందున మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. మృగశిర కార్తెను మృగశిర, మృగం, మిరుగు, మిర్గం అనే పేర్లతో పిలుస్తారు. దేశవ్యాప్తంగా దీన్ని ఓ పండుగలా జరుపుకుంటారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజలు సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు. వ్యవసాయ పనుల సీజన్ ఆరంభం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

Also Read: Priyanka Chopra: బ్రా లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?

మృగశిర కార్తె ఆగమనంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అందుకే వేడి కలగడానికి బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు. దీంతో శరీరంలో వేడి పెరిగి ఆరోగ్యం బాగుంటుంది. అందుకే ఇంకా మాంసాహారులైతే చేపలు తింటారు. ఈ కార్తె అంతా చేపలు తింటే మంచిదనే పూర్వీకుల ఆచారం కావడంతో చేపలు తినేందుకు ఇష్టపడతారు. మృగశిర కార్తెలో కనీసం కిలో చేపల ముళ్లయినా మన లోపల పడితే మంచిదని చెబుతారు. దీంతోనే చేపలు తినేందుకు ఎక్కువగా ముందుకొస్తారు.

Mrigasira Karthi

చేపలు తింటే గుండెజబ్బులు, ఆస్తమా జబ్బులు రాకుండా ఉంటాయి. అందుకే చేపలను ఆహారంలో తీసుకుని రోగాలు రాకుండా కాపాడుకుంటారు. ఈ కాలంలో జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి మందగిస్తుంది. అందుకే వాటి నుంచి రక్షించుకోవడానికి చేపలు తినడం సంప్రదాయంగా వస్తోంది. అంతేకాకుండా వ్యాధులు దరిచేరకుండా రక్షణ కోసం మన ఆహార అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ కార్తెతోనే మనకు అన్ని పద్ధతులు మారుతాయి.

మృగశిర కార్తె రైతులకు మాత్రం సంతోషం తెచ్చిపెట్టేదే. పంటల సాగుకు అనువైన కాలం కావడంతో రైతులంతా తమ పనుల్లో తలమునకలై ఉంటారు. భూములు సాగు చేసుకుంటూ విత్తనాలు విత్తుకుంటూ ఎవరి పనుల్లో వారుంటారు. ఎండాకాలం అంతా పని లేకుండా ఉన్న రైతులకు మృగశిర కార్తె వారికి చేతినిండా పని కల్పిస్తుంది.

Also Read:Pakistan Crisis: శ్రీలంక బాటలో పాకిస్తాన్.. దివాళా తీయనుందా?

Tags