Night Sleeping Tips: రోజంతా వివిధ కార్యకలాపాలకు వెళ్లినవారు.. ఉద్యోగం, వ్యాపారం చేసి ఇంటికి వచ్చినవారు కాస్త రిలాక్స్ అయి నైట్ డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. మరికొందరు అలాగే రాత్రి భోజనం చేసి పడుకుంటారు. కానీ రాత్రి పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని కొందరు వైద్యుని పనులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు టైట్ డ్రెస్ తో కాకుండా వదులుగా ఉన్న దుస్తులను వేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాకుండా ఇంకొందరు చెబుతున్నది ఏమిటంటే అసలు రాత్రి సమయంలో దుస్తులు లేకుండా నిద్రపోవడమే సరైన పద్ధతి అని అంటున్నారు. అసలు రాత్రి సమయంలో ఎలాంటి దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల లాభాలు ఉంటాయా? ఉంటే అవేంటి?
చాలామంది రాత్రి ఉదయంలో ధరించిన దుస్తులతోనే నిద్రపోతారు. మరికొందరు నైట్ డ్రెస్ వేసుకొని నిద్రిస్తారు. కానీ ఈ రెండింటి కంటే ఉత్తమమైన పద్ధతి ఎలాంటి దుస్తులు లేకుండా నిద్రపోవడమేనని ఇటీవల కొందరు వైద్య పరిశోధకులు పేర్కొన్నారు. శరీరంపై ఎలాంటి దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రి పడుకున్న తర్వాత శరీరం పూర్తిగా టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో రక్తప్రసరణ వేగం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంపై టైట్ దుస్తులు ఉండడం వల్ల రక్తప్రసరణ వేగం తగ్గి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పడుకున్న తర్వాత హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. ఇవి సక్రమంగా ఉండాలంటే శరీరంపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. అంటే శరీరంపై ఉన్న దుస్తులతో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
ఈ సమయంలో శరీరానికి తగినంత గాలి అవసరం ఉంటుంది. కానీ శరీరం పై దుస్తులు ఉండడం వల్ల గాలి తగలకుండా ఉండడంవల్ల చెమట ఎక్కువగా అవుతుంది. అంతేకాకుండా ప్రత్యేక ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి అలర్జీ వస్తుంది. మరి కొన్ని ప్రదేశాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంపై దుస్తులు ఉండడం వల్ల స్కిన్ హెల్త్ బూస్ట్ కు అడ్డుగా ఉంటుంది. రాత్రి పడుకున్న తర్వాత మగవారిలో టెస్ట్రోన్ బూస్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సమయంలో శరీరంపై దుస్తులు ఉంటే అవి రాకుండా అడ్డు పడతాయి. మరి ముఖ్యంగా మగ, ఆడవారిద్దరిలో శరీరం రిబూట్ కావడానికి అడ్డుగా ఉంటుంది. ఫలితంగా ఆ మరుసటి ఉదయం మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. ఒకవేళ ఎలాంటి దుస్తులు లేకపోతే ఉత్సాహంగా ఉండగలుగుతారు. అందువల్ల రాత్రి సమయంలో దుస్తులు లేకుండా నిద్రించడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు.