Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా ప్రజలను కరోనా భయం వెంటాడుతోంది. కొత్తకొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తుండటంతో అజాగ్రత్తగా ఉంటే కరోనా బారిన పడతామని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు సైతం వైరస్ బారిన పడుతుండటం గమనార్హం. కొత్త వేరియంట్ల వల్ల కరోనా వ్యాక్సిన్ మూడో డోసు కూడా తీసుకోవాలని వార్తలు వస్తున్నాయి.
అయితే వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి భారత వైద్య పరిశోధనా మండలి స్పందించింది. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల సోకుతున్న ఇన్ఫెక్షన్ తేలికపాటి ఇన్ఫెక్షన్ అని ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ బూస్టర్ అవసరం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఐసీఎంఆర్ విభాగాధిపతి డాక్టర్ సమీరన్ మాట్లాడుతూ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిలో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకొచ్చారు.
కరోనా వ్యాప్తి స్థితిగతులను బట్టి వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కు సంబంధించి సాంకేతిక సలహా బృందం నుంచి ఒక ప్రకటన వస్తుందని సమీరన్ వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వస్తున్న ఫలితాలను బట్టి రెండు డోసుల మధ్య వ్యవధి కరెక్ట్ అని సమీరన్ అన్నారు. ప్రయోగ పరీక్షలు జరగకుండా బూస్టర్ డోసును సిఫార్సు చేయలేమని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు సంబంధించిన నిపుణుల కమిటీ వెల్లడించింది.
Also Read: TRS: టీఆర్ఎస్ లో కోవర్టులపై చర్యలకు పార్టీ సిద్ధమవుతోందా?
మరోవైపు కరోనా థర్డ్ వేవ్ కు సంబంధించి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొత్త వేరియంట్ వల్ల పరిస్థితులు విషమించే అవకాశం ఉందని చెప్పలేమని డబ్ల్యూహెచ్‌వో సంచాలకురాలు డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ పేర్కొన్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని పూనమ్ ఖేత్రాపల్ చెప్పుకొచ్చారు.
Also Read: Petrol Bunk Services: వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఫ్రీ?