Eggs: ప్రతిరోజూ గుడ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. కోడిగుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశం ఉంటుంది. మాంసాహారం తినని వాళ్లు గుడ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు లభిస్తాయి. గుడ్లు తినడం వల్ల ఎముకలు సైతం దృఢంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే గుడ్లను ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
అయితే గుడ్లు తినడం వల్ల కొన్ని లాభాలు మాత్రం ఉన్నాయి. గుడ్లు తింటే శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది. జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి గుడ్లు ఎన్టో ఉపయోగకరం అని చెప్పవచ్చు. గుడ్లు తినడం వల్ల పురుషులతో పోలిస్తే మహిళల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కోడిగుడ్లలో ఉండే అమైనో ఆమ్లాల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు.
కోడిగుడ్ల ద్వారా సెలీనియం, క్యాల్షియం, జింక్ తో పాటు ఇతర విటమిన్లు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజూ కోడిగుడ్లు తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే కోడిగుడ్లను ఎక్కువమొత్తంలో తీసుకోవడం వల్ల నష్టాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.