Women Health: మద్యం ఆరోగ్యానికి హానికరం.. ఈ విషయం అందరికీ తెలుసు. మద్యం సీసాలపైనా రాసి ఉంటుంది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఒక పురుషుడు ఒకేసారి 5 డ్రింక్స్, ఒక మహిళ ఒకేసారి 4 డ్రింక్స్ తీసుకుంటే ఆమె అతిగా తాగేవారిగా ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇటీవల, ఆల్కహాలిక్ డ్రింక్స్‌పై ఒక అధ్యయనం జరిగింది. తక్కువ ఆల్కహాల్ తాగే మహిళలకన్నా.. వారానికి ఎనిమిది కంటే ఎక్కువ ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగే మహిళలకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది.
అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధన లక్ష్యం మద్యపానం, కోనరీ హార్ట్ డిసీజ్ మధ్య సంబంధాన్ని కనుగొనడం. దీనిపై యూనివర్సిటీ అధ్యయనం చేస్తోంది. ఉత్తర కాలిఫోర్నియాలోని కాన్సర్ పర్మనెంట్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్‌లో పరివోధకులు 18 నుంచి 65 ఏళ్ల వయసుగల 4.32 లక్షల మంది డేటాను ఉపయోగించారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ప్రకారం.. వారిలో 2.43 లక్షల మంది పురుషులు, 1.89 లక్షల మంది మహిళలు ఉన్నారు. వారి సగటు వయçసు 44గా పేర్కొంది. వీరిలో తక్కువ, మితమైన లేదా ఎక్కువ పరిమాణంలో తాగేవారు ఉన్నారు. వీరిని విశ్లేషించి.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ సేకరించారు.
గుండె జబ్బు ముప్పు ఎక్కువ..
కాలిఫోర్నియాకు చెందిన హార్ట్ స్పెషలిస్ట్, అధ్యయన అధిపతి డాక్టర్ జమాల్ రానా ఫాక్స్ మాట్లాడుతూ ఈ రోజుల్లో మద్యం సేవించడం గుండెకు మంచిదని పుకారు వ్యాపిస్తుంది. ఈ నమ్మకానికి వ్యతిరేకంగా పరిశోధనలు రుజువు చేశాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడానికి ఆల్కహాల్ కారణమని, మరింత అవగాహన ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు.
సురక్షితమైన పానీయం పరిమితి..
ఇక పురుషులు, మహిళలు ఇద్దరూ వారానికి ఒకటి లేదా రెండు పానీయాలకన్నా తక్కువగా ఆల్కహాల్ తీసుకునే స్థాయిని పరిశోధన గుర్తించింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ప్రకారం.. పురుషులకు వారానికి 3–14 పానీయాలు, మహిళలు వారానికి 3–7 పానీయాలు మితమైన మద్యపానంగా పరిగణిస్తారు. పురుషులకు వారానికి 15 లేదా అంతకంటే ఎక్కువ పానీయాలు, మహిళలకు, 8 లేదా అంతకంటే ఎక్కువ పానీయాలు అతిగా మద్యపానం జాబితాలో ఉంచారు. నాలుగేళ్ల తర్వాత పరిశీలించినప్పుడు 3,108 మంది కరోనరీ హార్ట్ డిసీజ్‌కు చికిత్స పొందారని పరిశోధకులు గుర్తించారు. ఇది అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తీవ్రమైందని నిర్ధారించారు. వారానికి 8 లేదా అంతకంటే ఎక్కువ పానీయాలు తాగే స్త్రీలు తక్కువ ఆల్కహాల్ తాగే మహిళల కంటే 33 నుంచి 51 శాతం ఎక్కువ గుండె జబ్బుల ముప్పును కలిగి ఉన్నారని తెలిపింది. అతిగా మద్యం సేవించే మహిళలపై ఒక అధ్యయనం నిర్వహించగా, మితంగా మద్యం సేవించే మహిళల్లో కంటే ఎక్కువగా తాగే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు మూడింట రెండొంతులు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది.