Mosquito Coil: వర్షాకాలం, చలికాలంలో దోమల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. దోమలు కుట్టడం వల్ల మలేరియా, టైఫాయిడ్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. దోమలను నియంత్రించడానికి చాలామంది రకరకాల చిట్కాలను పాటిస్తారు. కొంతమంది మస్కిటో కాయిల్స్ ద్వారా దోమలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే మస్కిటో కాయిల్స్ ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మస్కిటో కాయిల్స్ నుంచి వెలువడే కెమికల్స్ వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఒక్కో మస్కిటో కాయిల్ నుంచి 75 సిగరెట్ల కంటే ఎక్కువ పొగ ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ పొగ శ్వాసనాళాలలో తీవ్ర ఉద్రిక్తతను కలిగించి ఊపిరితిత్తులకు హాని కలిగించే అవకాశాలు ఉంటాయి. మస్కిటో కాయిల్స్ అనేక రసాయన పదార్థాల మిశ్రమం అనే విషయం తెలిసిందే.
Also Read: పాడి పరిశ్రమ కోసం స్టార్టప్ పోటీలు.. గెలిచిన వారికి ఏకంగా రూ.10 లక్షలు?
100 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో ఒక మస్కిటో కాయిల్ వల్ల కూడా అంతే ప్రమాదమని చెప్పవచ్చు. పిల్లలకు దోమలు కుట్టకుండా దోమతెరను వినియోగించడం, పిల్లలు పూర్తి స్లీవ్ దుస్తులు ధరించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం చేస్తే మంచిది. కాయిల్ లో ఉండే రసాయనాలను ఎక్కువ సమయం పీల్చుకుంటే ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ కళ్లపై, చర్మంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మస్కిటో కాయిల్ పొగ వల్ల కంటి సంబంధిత సమస్యలు పెరగడంతో పాటు కళ్లు, చర్మంపై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: రెడ్ రైస్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. బానపొట్ట సైతం కరిగేలా?