Omicron: దేశంలో కరోనా వైరస్ విజృంభణ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తోంది. 40కు పైగా దేశాలలో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లతో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు ఎక్కువగా ఈ కొత్త వేరియంట్ బారిన పడుతుండటం గమనార్హం. మన దేశం విషయానికి వస్తే ఇప్పటివరకు 23 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కీలక సూచనలు చేసింది. చిన్నపిల్లలు, ఒక్క డోసు కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకోని వాళ్లకు ఈ ముప్పు ఎక్కువని ఆమె చెబుతుండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు మళ్లీ 90 రోజుల్లోగా వైరస్ సోకితే రీ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సౌమ్య స్వామినాథన్ డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని వెల్లడించారు.
Also Read: గుడ్లను ఎక్కువగా తింటున్నారా.. ఈ తప్పు చేస్తే ప్రాణాలకే ప్రమాదం?
అయితే ఒమిక్రాన్ వేరియంట్ గురించి సమగ్ర అవగాహనకు రావాలంటే మరికొంత సమయం పడుతుందని ఆమె చెబుతున్నారు. రెండు నుంచి మూడు వారాలు వేచి చూస్తే ఒమిక్రాన్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని ఆమె వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు సైతం భారీ మొత్తంలో నష్టాలు వస్తున్నాయి. అయితే ఒమిక్రాన్ బారిన పడిన వాళ్లలో ఎవరూ ప్రాణాలను కోల్పోలేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్ కేసులు పెరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. వెలుగులోకి వస్తున్న కొత్త వేరియంట్లు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
Also Read: మూడో దెబ్బ అంటే ఇక కోలుకోవడం కష్టమే !