Radish Side Effects: ముల్లంగి తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ముల్లంగిని ఎంతో ఇష్టంగా తింటారు. శీతాకాలంలో ముల్లంగిని తినడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ముల్లంగి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేసి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ముల్లంగి కిడ్నీ సమస్యలతో పాటు కాలేయ సమస్యలను దూరం చేస్తుంది.
ముల్లంగి పరాఠాలను తింటే సెలరీ కచ్చితంగా తీసుకోవాలి. ముల్లంగి పరాఠాలతో క్యారెట్ కూడా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. కొంతమందికి ముల్లంగి తినడం వల్ల దురదలు, ఎలర్జీ వస్తుంది. అలాంటి వాళ్లు ముల్లంగి, పెరుగు కలిపి తీసుకుంటే మంచిది. పెరుగు ముల్లంగి ప్రభావాన్ని తగ్గించి గ్యాస్ సమస్య రాకుండా చేస్తుంది. తరచూ ముల్లంగి తినేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
ముల్లంగి ఒక దుంప పంట కాగా కొంతమంది వీటిని పచ్చిగా తింటారు. ముల్లంగి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తరచూ వస్తుంటే మాత్రం ముల్లంగికి దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.