https://oktelugu.com/

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే ?

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన సినిమా “పుష్ప”. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ గా వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిన ఈ మూవీ… రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. బన్నీ వన్ మ్యాన్ షోగా నిలిచిన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 4, 2022 / 09:56 AM IST
    Follow us on

    Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన సినిమా “పుష్ప”. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ గా వచ్చిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిన ఈ మూవీ… రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. బన్నీ వన్ మ్యాన్ షోగా నిలిచిన ఈ చిత్రం… 17 రోజులుగా వసూళ్లలో తగ్గేదే లే అంటూ రికార్డులు తిరగరాస్తుంది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమాకి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతుండడంతో భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తుంది.

    Pushpa Movie

    ఇక ఇప్పట్లో భారీ సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమాకు ఇంకా కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఓటీటీ బిజినెస్ కూడా భారీ ధరకే జరిగినట్టు తెలుస్తుంది. పుష్ప డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ భారీ ధరకి దక్కించుకున్న సంగతి తెలిసిందే. సహజంగా స్టార్ హీరోల సినిమాలు దాదాపుగా విడుదలైన నెల రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల చేస్తారు. దీంతో ఈ సినిమాను కూడా జనవరి 17 తర్వాతే స్ట్రీమింగ్ చేసే వీలుంటుంది అని అంతా భావిస్తున్నారు.

    Also Read: బీజేపీ ని టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్.. అక్రమ అరెస్టులపై బీజేపీ నేతల గుర్రు

    అయితే అతి త్వరలోనే పుష్ప సినిమా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలొస్తున్నాయి. కాగా జనవరి 7న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుందాని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుందని సినీ వర్గాల్లో కూడా టాక్ నడుస్తుంది. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

    Also Read: ఢీ మానేశాను కానీ అది మాత్రం మానను అంటున్న సుడిగాలి సుధీర్… అది ఏంటంటే ?