Corona Effect: దేశంలో కరోనా కేసులు తగ్గినా కరోనా భయం మాత్రం ప్రజల్లో తగ్గలేదు. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో థర్డ్ వేవ్, లాక్ డౌన్ భయాలు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. అయితే శాస్త్రవేత్తల పరిశోధనలలో కరోనా వైరస్ స్పెర్మ్ నాణ్యతను దెబ్బ తీసే అవకాశం ఉందని తేలింది. లండన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొన్ని నెలల పాటు స్పెర్మ్ పై ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
బెల్జియంలో కరోనా పాజిటివ్ వచ్చిన 120 మందిపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఇచ్చిన సమాచారం ప్రకారం వీళ్లు కరోనా నుంచి కోలుకోవడానికి నెల రోజుల నుంచి రెండు నెలల సమయం పట్టింది. స్పెర్మ్ మొటిలిటీ, స్పెర్మ్ కౌంట్ పై కరోనా వైరస్ వల్ల చెడు ప్రభావం పడనుంది. మరోవైపు డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ ప్రమాదకరమైన వేరియంట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: పిల్లలపై మామూలుగా లేదుగా?
2 లక్షల కరోనా రోగులపై పరిశోధన జరగగా ఇందులో 11,329 మందికి ఒమిక్రాన్ సోకింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ ప్రభావం ఏకంగా 5.4 శాతం ఎక్కువ కావడం గమనార్హం. సాధారణంగా ఆరోగ్యకరమైన పురుషుడు 120 నుంచి 350 చొప్పున స్పెర్మ్ లేదా స్పెర్మాటోజోను కలిగి ఉంటాడు. పురుషుల వీర్యంలోని స్పెర్మాటోజోవా సంఖ్యను స్పెర్మ్ కౌంట్ సూచిస్తుంది. సాధారణ వ్యక్తి వీర్యంలో ఉండే స్మెర్మ్ లు లైంగిక జీవితంపై ప్రభావం చూపుతాయి.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంది. సాధారణంగా కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు 6 నెలల్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే ఛాన్స్ 85 శాతం ఉండగా ఒమిక్రాన్ సోకిన రోగికి 19 శాతం రక్షణ కలుగుతుంది.
Also Read: కమ్ము కొస్తున్న ‘ఒమిక్రాన్’ మబ్బు.. ఫిబ్రవరిలో లాక్ డౌన్?