భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గతంతో పోలిస్తే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గినా వైరస్ అదుపులోకి రాలేదు. చాలామంది కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్నా వైరస్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో ఒక కొత్త అధ్యయనం ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వారికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
Also Read: ఈ లక్షణాలు ఉంటే కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదా..?
కరోనా నుంచి కోలుకున్న వారిలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు కోలుకున్న 140 రోజుల్లోగా మరణిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ లిచెస్టర్, ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటాస్టిక్స్ కు చెందిన బాంబ్ సేల్ రీసెర్చ్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 29.4 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రులలో చేరుతున్నట్టు తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో 12.3 శాతం మంది మరణించారని అధ్యయనంలో వెల్లడైంది.
Also Read: కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తప్పనిసరిగా తీసుకోవాలా..?
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కాలేయం, కిడ్నీ, షుగర్ సమస్యలతో బాధ పడే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లు ఎక్కువగా మరణిస్తున్నట్టు తెలుస్తోంది. 47,780 మంది కోలుకున్న వారిపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్న వారిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని సూచనలు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక కరోనా సమస్యల కొరకు వైద్య సేవలను అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా నుంచి కోలుకున్నా వైరస్ ప్రభావం వల్ల చాలామందిని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.