Scrup Typhus: ఉత్తరప్రదేశ్ లో కొత్త వ్యాధి వ్యాప్తి.. 8 మంది చిన్నారులు మృతి..?

Scrub Typhus: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్ని కావు. కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో ఉత్తర భారతంలో కొత్త వ్యాధి వ్యాప్తి మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కొత్తరకం వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైద్య నిపుణులు స్క్రబ్ టైఫస్ పేరుతో పిలవబడే ఈ వ్యాధి బారిన చాలామంది పిల్లలు పడ్డారని చెబుతున్నారు. మథుర జిల్లా మెడికల్‌ ఆఫీసర్ డాక్టర్‌ రచన గుప్తా కోహ్ అనే గ్రామంలోనే 26 మంది […]

Written By: Navya, Updated On : September 2, 2021 10:49 am
Follow us on

Scrub Typhus: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్ని కావు. కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో ఉత్తర భారతంలో కొత్త వ్యాధి వ్యాప్తి మొదలైంది. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కొత్తరకం వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైద్య నిపుణులు స్క్రబ్ టైఫస్ పేరుతో పిలవబడే ఈ వ్యాధి బారిన చాలామంది పిల్లలు పడ్డారని చెబుతున్నారు. మథుర జిల్లా మెడికల్‌ ఆఫీసర్ డాక్టర్‌ రచన గుప్తా కోహ్ అనే గ్రామంలోనే 26 మంది చిన్నారులకు స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయిందని చెప్పుకొచ్చారు.

ఈ ప్రాంతంలో ఇప్పటికే పదిమంది చనిపోయారని చనిపోయిన పదిమందిలో ఎనిమిది మంది చిన్నారులు అని రచన గుప్తా తెలిపారు. ఈ గ్రామంతో పాటు పిప్రోత్‌లో ముగ్గురు, రాల్‌లో 14, జసోడాలో 17 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఆగ్రా, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, కస్గంజ్ జిల్లాలలో కూడా ఈ వ్యాధి బారిన పడి చనిపోయిన వారు ఉన్నారు. అధికారులు ఆయా ప్రాంతాల ప్రజలలో లక్షణాలు కనిపిస్తే నమూనాలను సేకరిస్తున్నారు.

ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం అయితే ఉంటుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెబుతున్నారు. చిగ్గర్స్ అనే పురుగు కాటు వేయడం వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. ఎవరైతే ఈ వ్యాధి బారిన పడతారో వాళ్లకు జ్వరం, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు ఉంటాయి.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రస్తుతం ఈ వ్యాధికి ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని చెబుతోంది. చెట్ల పొదలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో చిగ్గర్స్ సంచరిస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. చిన్నారులకు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.