Is Rice Cooker Bad For Health: రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..

Is Rice Cooker Bad For Health: ఇప్పుడు ఉన్న లైఫ్ అంతా బిజీ బిజీ. జనాలకు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని రెడీమేడ్ పనులుగా మారిపోయాయి. వేడినీటి దగ్గరనుంచి.. అన్నం, కూరలు వండుకొని తినే వరకు అన్ని కరెంటు లేదా ఎలక్ట్రికల్ పరికరాల మీదే చేసుకుంటున్నారు. హీటర్ పెట్టి వాటర్ వేడి చేసుకునే దగ్గరనుంచి.. రైస్ కుక్కర్ లో అన్నం వండుకునే వరకు అంతా ఎలక్ట్రికల్ మయం అయిపోయింది. అయితే […]

Written By: Mallesh, Updated On : March 21, 2022 6:01 pm
Follow us on

Is Rice Cooker Bad For Health: ఇప్పుడు ఉన్న లైఫ్ అంతా బిజీ బిజీ. జనాలకు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని రెడీమేడ్ పనులుగా మారిపోయాయి. వేడినీటి దగ్గరనుంచి.. అన్నం, కూరలు వండుకొని తినే వరకు అన్ని కరెంటు లేదా ఎలక్ట్రికల్ పరికరాల మీదే చేసుకుంటున్నారు. హీటర్ పెట్టి వాటర్ వేడి చేసుకునే దగ్గరనుంచి.. రైస్ కుక్కర్ లో అన్నం వండుకునే వరకు అంతా ఎలక్ట్రికల్ మయం అయిపోయింది. అయితే ఇలా ఎలక్ట్రికల్ వస్తువులపై వండిన వంటకాలు చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

మరీ ముఖ్యంగా ఈ కాలంలో చాలామంది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో అన్నం వండుకొని తింటున్నారు. కట్టెల పొయ్యి మీద వండుకునే తీరిక లేక.. ఇలా సులభంగా వండుకోవచ్చని భావిస్తున్నారు. కానీ ఇలా వండిన అన్నం చాలా విషతుల్యమని సైంటిస్టులు చెబుతున్నారు. వాస్తవానికి రైస్ కుక్కర్ లు అన్నీ కూడా అల్యూమినియంతో తయారు చేస్తారు. ఈ అల్యూమినియంలో వంటలు చేయడం మంచిది కాదు.

ఎందుకంటే అన్నం వండేటప్పుడు దాని మీద గాలి వెలుతురు ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆహారం ఆరోగ్యకరంగా తినడానికి బాగుంటుంది. కానీ రైస్ కుక్కర్ లో అన్నం మీద వెలుతురు, గాలి లాంటివి పడవు. పైగా అల్యూమినియం కూడా కొద్దికొద్దిగా కరుగుతూ ఆహారంలో కలిసి పోతుందంట. ఇలా కడుపులోకి వెళ్ళిన అల్యూమినియం కొన్ని నెలల తర్వాత మన శరీర వ్యవస్థపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

Also Read: Pawan Kalyan: డబ్బుల కోసం ఇంతకు దిగజారుతారా.. జగన్ పై పవన్ ఫైర్

అల్యూమినియం పాత్రలలో ఆహారాన్ని నిల్వ ఉంచడం కూడా చాలా ప్రమాదకరం. వీటిల్లో పులుపు, యాసిడ్ లాంటి పదార్థాలను అస్సలు నిల్వ ఉంచకూడదు. ఈ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే గుండె సంబంధిత సమస్యలు, ఉదర సమస్యలు, షుగర్, కీళ్లవాతం, అధిక బరువు, నడుము నొప్పి, గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ అల్యూమినియం పాత్రలలో వండిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు.

Also Read: Nandamuri Balakrishna యాక్షన్ లేని బాలయ్య సినిమా ఏమిటో మీకు తెలుసా ?

Recommended Video:

Tags