https://oktelugu.com/

Alcohol Study : తక్కువ మద్యం తీసుకోవడంపై 12 ఏళ్ల పాటు పరిశోధనలు.. రిజల్ట్స్ చూస్తే షాకవుతారు..

అల్కహాల్ తక్కువ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే పరిశోధనను వీరు కొట్టి పారేశారు. మద్యపానం తక్కువగా తీసుకున్నా గుండె జబ్బులు, మరణాల రేటును తగ్గించలేవని అన్నారు. అయితే కొంత మంది అనారోగ్యాల బారిన పడినందుకు మద్యం మానేసిన వారు కూడా ఉన్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 22, 2024 11:59 am
    low alcohol consumption

    low alcohol consumption

    Follow us on

    Alcohol Study :  ఉదయం నుంచి పొద్దు పోయే వరకు పనులు.. అనుకోని టెన్షన్లు.. ఒత్తిడి.. వీటి నుంచి రిలాక్స్ కావడానికి చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. ఈ క్రమంలో కొందరు సినిమాలు చూస్తారు..మరికొందరు విహార యాత్రలకు వెళ్తారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి మద్యం సేవిస్తుంటారు. మద్యం సేవించడం వల్ల అప్పటి వరకు ఉన్న బాధలన్నీ తొలగిపోతాయిన కొందరి నమ్మకం. కానీ మరికొందరు మాత్రం ఇదే పనిగా అతిగా మద్యం సేవిస్తూ ఉంటారు. మద్యం మితంగా తాగితే ఆరోగ్యం… అతిగా తాగితే విషం… చాలా సందర్భాల్లో వైద్యులు చెప్పారు. అయితే తక్కువ మద్యం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎక్కువ తాగితే ఏం జరుగుతుంది? పరిశోధనల ద్వారా వెల్లడైన ఈ వివరాలు మీకోసం..

    మద్యం సేవించడంపై సందర్భాన్ని బట్టి పరిశోధనలు జరగుతూనే ఉన్నాయి. అయితే చాలా మంది తక్కువ మద్యం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు 12 ఏళ్ల పాటు కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. తక్కువ మోతాదు తీసుకున్నా ఆల్కహాల్ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందని వారు ధ్రువీకరించారు.

    తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితమేనా? అనే కాన్సెప్టుపై వైద్య శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు న్న 1,35,103 మందిని పరిగణలోకి తీసుకున్నారు. వీరిపై 12 ఏళ్ల పాటు పరిశోధనలు చేరశారు. వీరు తక్కువ మోతాదులో మద్యం తీసుకోవడాన్ని గమనించారు. దీనిపై యూనివర్సిడాడ్ ఆటోనోమా డి మాడ్రిడ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ ప్రొపెసర్ డాక్టర్ రోసారియో ఓర్టోలా వివరించారు. తక్కువ మద్యం తీసుకున్నా.. ఆరోగ్యానికి ప్రమాదమేనని అన్నారు. జామా నెట్ వర్క్ లో ప్రచురించి అధ్యయనం ప్రకారం అల్కాహాల్ ను ఎలా తీసుకున్నా.. క్యాన్సర్ కారకాలను పెంచుతుందని అన్నారు.

    అల్కహాల్ తక్కువ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే పరిశోధనను వీరు కొట్టి పారేశారు. మద్యపానం తక్కువగా తీసుకున్నా గుండె జబ్బులు, మరణాల రేటును తగ్గించలేవని అన్నారు. అయితే కొంత మంది అనారోగ్యాల బారిన పడినందుకు మద్యం మానేసిన వారు కూడా ఉన్నారు. మద్యపానం సేవించి మరణించే వారి సంఖ్యతో పోలిస్తే మితంగా తాగి మరణించే వారి సంఖ్య తగ్గలేదని అంటున్నారు. దీంతో అల్కహాల్ ప్రమాదమే అని తేల్చారు.

    అయితే ప్రస్తుతం యూఎస్ ఆహార సంస్థ చేసిన మార్గదర్శకాల ప్రకారం మద్యాన్ని తక్కువగా తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదని తెలిపింది. పురుషులు రెండు పెగ్గులు, మహిళలు ఒక డ్రింక్ తీసుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే అతిగా మద్యం సేవిస్తే మాత్రం క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదాలు ఎదురవుతాయని అంటున్నారు. అటే పురుషులు రోజుకు 20 నుంచి 40 గ్రాములు, మహిళలు 10 నుంచి గ్రాములు మద్యం తీసుకోవచ్చని తెలుపుతున్నారు. అయితే వృద్ధులు తక్కువగా మద్యం తీసుకున్నా.. సామాజిక, ఆర్థిక ప్రయోజనాల కారణంగా మరణాల రేటు తగ్గించలేమని పరిశోధనలు తెలుపుతున్నాయి.