https://oktelugu.com/

Honey Badger : ప్రపంచంలోనే భయం లేని జంతువు.. ఛత్తీస్‌గఢ్‌లో ప్రత్యక్షం.. వీడియో వైరల్

Honey Badger : ఈ ప్రపంచంలోనే భయం లేని జంతువు ఏదైనా ఉందంటే అది ‘హనీ బ్యాడ్జర్’. దీన్ని అడవిలో ‘అత్యంత నిర్భయ జంతువు’గా పిలుస్తారు. సైజు, సామర్థ్యంతో సంబంధం లేకుండా ఎంత పెద్ద క్రూర జంతువుతోనైనా ఇది పోరాడగలదు. గట్టి పోటీని ఇస్తుంటాయి. ఈ హనీ బ్యాడ్జర్ ఎడారిలో ఏమాత్రం భయం లేకుండా ఒంటరిగా జీవిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ధైర్యమైన భయం లేని జంతువుగా ఇది పేరుగాంచింది. ఇవి ఓ అరుదైన జాతికి చెందిన జంతువులు […]

Written By: NARESH, Updated On : August 20, 2022 9:03 am
Follow us on

Honey Badger : ఈ ప్రపంచంలోనే భయం లేని జంతువు ఏదైనా ఉందంటే అది ‘హనీ బ్యాడ్జర్’. దీన్ని అడవిలో ‘అత్యంత నిర్భయ జంతువు’గా పిలుస్తారు. సైజు, సామర్థ్యంతో సంబంధం లేకుండా ఎంత పెద్ద క్రూర జంతువుతోనైనా ఇది పోరాడగలదు. గట్టి పోటీని ఇస్తుంటాయి. ఈ హనీ బ్యాడ్జర్ ఎడారిలో ఏమాత్రం భయం లేకుండా ఒంటరిగా జీవిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ధైర్యమైన భయం లేని జంతువుగా ఇది పేరుగాంచింది. ఇవి ఓ అరుదైన జాతికి చెందిన జంతువులు అని చెప్పొచ్చు.

హనీ బ్యాడ్జర్ చర్మం ఎలాస్టిక్ గా ఉంటుంది. పదునైన పళ్లు ఉంటాయి. సింహం, పులి, చిరుత, కొండ చిలువు ఇలా ఏ జంతువుతోనైనా యుద్ధం చేయగలదు. పాము విషయం కూడా హనీ బ్యాడ్జర్ ను ఏమీ చేయలేదు.

అయితే ఈ హనీ బ్యాడ్జర్ అడవుల్లో అంతరించిపోయాయి. ఆఫ్రికా సహా కొన్ని దేశాల్లో మాత్రమే వీటి ఉనికి ఉంది. రాత్రిళ్లు మాత్రమే ఇవి తిరుగుతాయి. అలాంటి అరుదైన జంతువు మన దేశంలో కనిపించింది. అదే ఇప్పుడు వైరల్ గా మారింది.

హనీ బ్యాడ్జర్ ఛత్తీస్‌గఢ్‌లో దర్శనమిచ్చింది. అత్యంత అరుదైన ఇది కంటపడడం వన్యప్రాణి అధికారులను ఆశ్చర్యపరిచింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి దీపాంశు కబ్రా దీన్ని బయటి ప్రపంచానికి తెలియజెప్పారు. చత్తీస్ ఘడ్ కంకేర్ జిల్లాలోని కోటల్‌భట్టి గ్రామంలో కనిపించిన హనీ బ్యాడ్జర్ వీడియోను దీపాంశు పోస్ట్ చేసారు.

ఈ జంతువును రేటెల్ అని కూడా పిలుస్తారు, దీనిని ఒక రైతు కనుగొన్నాడు. రాత్రిపూట సంచరించే ఈ క్షీరదం భారతదేశంతో సహా ఆఫ్రికా మరియు దక్షిణాసియాలోని పెద్ద అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది చాలా రహస్యంగా జీవిస్తుంది.అందుకే కనిపించడం చాలా అరుదు.

హనీ బ్యాడ్జర్ తనకు ఆపద ఎదురైతేనే దాడి చేస్తుంది. మనుషులు, గుర్రాలు, కుక్కలు, పాములు, సింహాలు , హైనాలపైన కూడా దాడి చేసింది. తన పదునైన గోళ్లతో దాడి చేస్తుంది. దీని చర్మం అత్యంత మందంగా ఉంటుంది. బాణాలను కూడా తట్టుకోగలదు. కొడవలితో నరికినా ఏం కానంత ధృఢంగా ఉంటుంది.

హనీ బ్యాడ్జర్‌లు ఎక్కువగా తేనెను, తేనెటీగ లార్వా, కీటకాలు, ఉభయచరాలు, పాములు, చిన్న క్షీరదాలు, బెర్రీలు, మరిన్నింటిని తింటాయి. ఇవి సర్వభక్షకులు అయినప్పటికీ, వాటి ఆహారం ప్రధానంగా మాంసాహారం.

दुनिया का सबसे निर्भीक जानवर Honey Badger