Quit Smoking Benefits: మన శరీరం అంతర్గత నిర్మాణం ఒక విధంగా ఉంటుంది. బహిర్గత నిర్మాణం ఇంకొక విధంగా ఉంటుంది. అంతర్గత నిర్మాణంలో అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని ఎంత మెరుగ్గా చూసుకుంటే.. పనితీరు అంత గొప్పగా ఉంటుంది. అందుకే వైద్యులు మిత ఆహారం తీసుకోవాలి అంటారు. వ్యసనాలకు దూరంగా ఉండాలి అంటారు. మద్యపానం మానేయాలని
.. ధూమపానం చేయకూడదని చెబుతుంటారు. కానీ మనలో చాలామందికి అలవాటు విపరీతంగా ఉంటుంది. సరదాగా మొదలైన అలవాటు వ్యసనంగా మారిపోతూ ఉంటుంది. అధిక్రమేపి ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తుంది. చివరికి ప్రాణాలు పోతాయి.
మద్యం తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అవి శరీరం మీద రకరకాలుగా ప్రభావం చూపిస్తుంటాయి. చివరికి ప్రాణం పోతుంది. ధూమపానం చేస్తే కూడా ఇటువంటి సమస్యలే ఎదురవుతాయి. ముఖ్యంగా శ్వాస కోశ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది.. ఊపిరితిత్తులు పనిచేయడం తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. లాలాజలంలో రక్తం పడుతుంది. ఫలితంగా రకరకాల వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. చివరికి ప్రాణాలు కూడా పోతుంటాయి.
స్మోకింగ్ అనేది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనది. అది కేవలం ఆరోగ్య విషయంలోనే కాదు.. ఆర్థికంగా కూడా స్మోకింగ్ పెద్ద అద్దంకిగా ఉంటుంది. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం మన దేశంలో పొగాకు మానేయడం వల్ల 1.5 కోట్ల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయట. అవి ఎగువ మధ్యతరగతి స్థాయికి చేరుకుంటాయట. ఈ వృధా ఖర్చును పిల్లల చదువుకు.. పౌష్టికాహారం అందించడం వైపు మళ్ళిస్తే.. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఆ అలవాటు మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి ఐశ్వర్యం కూడా పెరుగుతుంది.
సిగరెట్లు పొగాకు.. ఇంకా అనేక రకాలైన ప్రమాదకరమైన పదార్థాలతో తయారుచేస్తారు. పొగ తాగడం వల్ల ఆపదార్ధాలు మొత్తం శరీరంలోకి చేరిపోతాయి. దీనివల్ల తాత్కాలిక ఆనందం లభిస్తుంది. మెదడు ఉత్తేజితమైన అనుభూతి కలుగుతుంది. కానీ ఆ ప్రమాదకరమైన పదార్థాలు రక్తంలో కలిసిపోవడం వల్ల రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితమవుతాయి. లాలాజలంలో రక్తం పడుతుంది. ఆ తర్వాత గుండె.. ఇతర అవయవాలు పనితీరుపై ప్రభావం పడుతుంది.
పైగా నేటి కాలంలో యువత స్మోకింగ్ విపరీతంగా చేస్తోంది. స్మోకింగ్ చేయడాన్ని గొప్ప అలవాటుగా భావిస్తోంది. దీనివల్ల చిన్నతనంలోనే యువత అనేక రకాల వ్యాధుల బారిన పడుతోంది. ముఖ్యంగా యువతులు కూడా స్మోకింగ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం.. ఇంకా రకరకాలైన కారణాలవల్ల యువత స్మోకింగ్ బారిన పడుతోంది. అయితే ఈ అలవాటు మంచిది కాదని.. దీని నుంచి బయటపడేందుకు చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. అదేపనిగా సిగరెట్లు తాగితే మాత్రం ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.