Best Health Tips in Telugu: మనలో చాలామంది మాంసాహారంను చాలా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. మాంసాహారం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మాంసాహారం తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కూడా లభిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే చికెన్, మటన్, గుడ్లు పరిమితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని పరిమితికి మించి తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఫ్రిజ్ లో ఈ ఎనిమిది పదార్థాలను ఉంచితే చాలా ప్రమాదం.. అవేంటంటే?
శరీరంలో ప్రోటీన్లు మరీ ఎక్కువైనా ఆరోగ్యానికి నష్టమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రోటీన్ షేక్స్‌ను ఎక్కువగా తీసుకుంటే కూడా అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రోటీన్లను ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రోటీన్ల మోతాదు మించితే శరీరానికి నష్టం కలుగుతుందని గుర్తుంచుకోవాలి.
ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గే అవకాశం అయితే ఉంది. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపోగోనాడిజం అనే సమస్య బారిన పడే అవకాశం ఉంటుంది. వీర్యంలోని శుక్రకణాల కౌంట్ పై ప్రొటీన్ల వల్ల ఎఫెక్ట్ పడుతుంది. పిల్లల కొరకు ప్లాన్ చేస్తున్న పురుషులు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.
ప్రోటీన్లు అధికంగా ఉండే ఫుడ్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అధిక ప్రోటీన్స్ ఉండే ఫుడ్స్ ను తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు. యూనివర్సిటీ ఆఫ్ వోర్సెస్టర్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Also Read: వేసవిలో సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. పాటించాల్సిన చిట్కాలివే!