ఈ పంటతో ఎకరాకు రూ.15 లక్షల లాభం.. పూర్తి వివరాలతో?

దేశంలోని చాలామంది రైతులు వ్యవసాయం చేయడం వల్ల లక్షల రూపాయలు నష్టపోతున్న సంగతి తెలిసిందే. రైతులలో చాలామంది ప్రస్తుతం వ్యవసాయం దండగ అని భావిస్తున్నారు. అయితే కాలానికి అనుగుణంగా పంటను వేయడం ద్వారా వ్యవసాయంతో లక్షల రూపాయలు లాభం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతులకు లాభాలను అందించే అల్లం పంట గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మన దేశంలోని వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో అల్లం ఒకటి. అల్లంలో మనుషులకు మేలు చేసే ఎన్నో […]

Written By: Navya, Updated On : November 11, 2021 11:43 am
Follow us on

దేశంలోని చాలామంది రైతులు వ్యవసాయం చేయడం వల్ల లక్షల రూపాయలు నష్టపోతున్న సంగతి తెలిసిందే. రైతులలో చాలామంది ప్రస్తుతం వ్యవసాయం దండగ అని భావిస్తున్నారు. అయితే కాలానికి అనుగుణంగా పంటను వేయడం ద్వారా వ్యవసాయంతో లక్షల రూపాయలు లాభం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతులకు లాభాలను అందించే అల్లం పంట గురించి మనం ఈరోజు తెలుసుకుందాం.

మన దేశంలోని వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో అల్లం ఒకటి. అల్లంలో మనుషులకు మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో ఈ పంటను వేయడం వల్ల లక్షల్లో లాభాలను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవాళ్లు అల్లం కోసం మొదట భూమిని సిద్ధం చేసుకుని పొలాన్ని రెండు మూడుసార్లు దున్ని మట్టి లూజుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆ తర్వాత ఎరువుగా ఆవుపేడను చల్లి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా నీటి పారుదల జరిగేలా చూడాలి. ఒక హెక్టార్ కు ఏకంగా 3 టన్నుల విత్తనాలను నాటుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఒక హెక్టార్ భూమిలో అల్లంను సాగు చేయడం ద్వారా 3 టన్నుల వరకు విత్తనాలను నాటుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కిలో అల్లం 80 రూపాయల నుంచి 100 రూపాయలు పలుకుతుండగా అల్లంను సాగు చేస్తే కచ్చితంగా మంచి లాభాలు సొంతమవుతాయి.

ఒక హెక్టార్ భూమిలో అల్లంను సాగు చేయాలంటే కనీసం 7 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి లాభం 25 లక్షల రూపాయలు అంటే నికర లాభం కనీసం 15 లక్షల రూపాయలుగా ఉంటుంది. తక్కువ స్థలంలో ఆదాయం సంపాదించుకోవాలనుకునే వాళ్లకు ఈ పంట ఉత్తమమైన పంట అని చెప్పవచ్చు. అల్లం సాగు చేసే రైతులు ప్రభుత్వం నుంచి రుణం పొందే అవకాశం కూడా ఉంటుంది.

Also Read: ఆల్కహాల్ ఇలా విషంగా మారుతుందా.. తాగేవాళ్లు ఎందుకు చనిపోతున్నారంటే?