Children Mobile Problem: ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మొబైల్ అలవాటు చేస్తున్నారు. చిన్నప్పుడు వారు అన్నం తినకపోయినా.. ఏడ్చినా.. మొబైల్ ఇచ్చి వారికి సముదాయిస్తున్నారు. అయితే ఇది క్రమంగా వారికి అలవాటుగా మారిపోతుంది. ఆ తర్వాత మొబైల్ లేకుండా ఏ పని చేయలేకపోతున్నారు. అన్నం తినేటప్పుడు కూడా మొబైల్ కచ్చితంగా ఉండాలని మారం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో వారిలో అనేక ఆరోగ్య సమస్యలను చూడాల్సి వస్తుంది. తరచూ మొబైల్ లేదా టీవీ స్క్రీన్ చూడడం వల్ల వారిలో ఎటువంటి సమస్యలు వస్తాయంటే?
చిన్నపిల్లలు తరచుగా మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల వారిలో కన్నులపై ప్రభావం పడుతుంది. అంటే డ్రై ఐ, రెడ్ నెస్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే మొబైల్ స్క్రీన్ దగ్గరగా చూసి అలవాటు ఉన్న వారిలో మయోపియా అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే నిద్ర హార్మోన్ తగ్గి నిద్ర రాకుండా సమస్యలను ఎదుర్కొంటారు.
ఎక్కువగా మొబైల్ స్క్రీన్ చూసే వారిలో మెదడు అభివృద్ధి తక్కువగా ఉంటుంది. అంటే అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. సృజనాత్మకత ఆలోచన తగ్గిపోయి ఎక్కువగా మాట్లాడలేక పోతారు. సమాజంలో మనుషులతో ఎక్కువగా కలవలేక పోతారు. సామాజిక నైపుణ్యాల విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపారు.. మరి ముఖ్యంగా రెండు నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా మొబైల్ స్క్రీన్ చూస్తే వారిలో మాటలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీంతో వారు ఎక్కువగా ఎలాంటి విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపరు.
మొబైల్ స్క్రీన్ కు ఎక్కువగా అలవాటు అయిన వారు వారు మొబైల్ చూస్తే ఒకసారి గా తీసుకోవడం వల్ల వారిలో కోపం పెరిగిపోతుంది. దీంతో ఎక్కువగా అరుస్తారు. అలాగే వారిలో అసహనం పెరిగిపోతుంది. హైపర్ యాక్టివిటీ పెరిగిపోయి మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. మెదడులో డోపమిన్ ఎక్కువగా విడుదలై అడిషన్ లా ప్రవర్తిస్తారు. అంటే మొబైల్ లేకపోతే ఇక తాము ఉండలేము అని ఫీలింగ్కు వస్తారు. మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల ఇతరులతో ఎక్కువగా మాట్లాడకుండా ఉంటారు.
స్క్రీన్ ప్రభావం వల్ల చిన్న పిల్లల మెదడుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. వీరు సులభంగా నిద్రపోరు. ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తుంటారు. నిద్ర గడియారం చెడిపోవడంతో మిగతా పిల్లల కంటే వెనుకబడిపోతారు. దీంతో వారిలో వెనుక పడ్డామని భావన పెరిగిపోయి మరింత కుంగిపోతారు. ఏ పని చేయడానికి ముందుకు వెళ్లరు.
మానసికంగా కాకుండానే శారీరకంగా కూడా ఎక్కువసేపు మొబైల్స్ స్క్రీన్ చూడడం వల్ల బరువు పెరుగుతారు. ఇక చాలామంది ఆహారం తినేటప్పుడు మొబైల్ స్క్రీన్ చూసి అలవాటు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకొని అధిక కొవ్వు గల పదార్థాలు తెలియకుండానే తీసుకుంటారు. దీంతో వయసుకు మించిన బరువు పెరిగిపోతారు. ఆ తర్వాత గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.