Chiranjeevi Spirit: ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడం అనేది చాలా ఇబ్బందులతో కూడుకున్న పని… నిజానికి సినిమా స్టార్ట్ చేయడం ఒకెత్తయితే సినిమాతో సక్సెస్ ని సాధించడం మరొక ఎత్తనే చెప్పాలి. ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత రన్బీర్ కపూర్ తో చేసిన ‘అనిమల్’ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ట్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఎవరికీ రానటువంటి గొప్ప గుర్తింపు సందీప్ కి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ లో సత్తా చాటుకుంటున్న దర్శకులు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ని సాధించిన దర్శకుడు సందీప్ రెడ్డివంగ కావడం విశేషం. ఆయన సినిమాల్లో కొత్తదనం ఉండడమే కాకుండా ప్రేక్షకుడిని మెప్పించే విధంగా సన్నివేశాలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి ఆయన సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకుడికి బాగా నచ్చుతోంది. అలాగే ప్రతి సన్నివేశంలో ఉండే బ్యా గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ని కనెక్ట్ చేసే విధంగా ఉంటుంది. అందుకే అతనిని ఈతరం దర్శకులందరి లో సెపరేట్ గా చేస్తు ఉండడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ఆయన సాధించిన విజయాలు అతనికి గొప్ప స్థాయిలో సక్సెస్ ను తీసుకొచ్చి పెట్టడమే కాకుండా ఇప్పుడు ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశాన్ని కూడా అందించింది. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా సందీప్ రెడ్డి వంగకి వచ్చిన గుర్తింపు ఆ దర్శకులకు రావడం లేదు. ప్రభాస్ లాంటి నటుడు చేస్తున్న ఈ సినిమాని ఈరోజు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా అభిమాన హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. సందీప్ డైరెక్షన్ ట్రైల్స్ లో ఉన్నప్పుడు ఎప్పటికైనా తన సినిమాని చిరంజీవి చేతుల మీదుగా స్టార్ట్ చేయించుకోవాలనే ఒక డ్రీమ్ పెట్టుకున్నాడట.
అందువల్లే స్పిరిట్ సినిమాను చిరంజీవి చేతుల మీదుగా స్టార్ట్ చేయించినట్టుగా తెలుస్తోంది. అందుకే తనని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసి మరి ఈ ఈవెంట్ ను గ్రౌండ్ సక్సెస్ గా నిలిపే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే చిరంజీవి సైతం తన అభిమాని కోసం వచ్చి సినిమాని స్టార్ట్ చేయడం అనేది నిజంగా అతని గొప్పతనం అనే చెప్పాలి…