Pregnancy Food Avoid: సాధారణంగా ప్రతి ఒక్క మహిళా జీవితంలో తల్లి కావడం ఎంతో గొప్ప వరంగా భావిస్తారు. ఈ క్రమంలోనే తల్లి కాబోతున్న విషయం తెలియగానే తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా గర్భధారణ జరిగిన తర్వాత కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక మహిళ సరైన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోతే బిడ్డ ఎదుగుదలలో సమస్యలు ఏర్పడటమే కాకుండా కొన్నిసార్లు అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ప్రెగ్నెన్సీ సమయంలో ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరం.ఇకపోతే ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏవి అనే విషయానికి వస్తే…
గర్భిణీ స్త్రీలు జున్ను తినడాన్ని పూర్తిగా నిరోధించాలి. వీలైనంత వరకు జున్నును పక్కన పెట్టడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఎంతో మంచిది.గర్భవతులు జున్ను తినడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరిగి ఎంతో అసౌకర్యంగా ఉంటుంది.కనుక వీలైనంత వరకు జున్ను దూరం పెట్టాలి. పచ్చి గుడ్లు పచ్చి మాంసం తినడం పూర్తిగా దూరం పెట్టాలి. ఇలా పచ్చి మాంసం తినడం వల్ల సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వృద్ధి చెంది ఎన్నో రకాల వ్యాధులకు గురిచేస్తోంది. అలాగే ఎక్కువగా పిండి పదార్థాలు, ఐస్ క్రీమ్ కేక్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.
Also Read: Peanuts Side Effects: ఈ సమస్యతో బాధపడే వారు వేరుశనగకు దూరంగా ఉండాల్సిందే…?
గర్భిణి స్త్రీలు పొప్పడి పండును తినకూడదు. ఇలా పొప్పడి పండు తినటం వల్ల డెలివరీ సమయంలో అధిక రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ పండులో
లాటేక్స్ అధికంగా ఉండటం వల్ల ఇది గర్భాశయ గోడలను సంకోచానికి గురిచేస్తుంది. ఈ క్రమంలోని అధిక రక్తస్రావం జరుగుతుంది. గర్భధారణ తొమ్మిది నెలల సమయంలో అధికంగా తీపి పదార్థాలను తినకూడదు. ఈ విధంగా తీపి పదార్థాలను తినడం వల్ల కొన్నిసార్లు మధుమేహం బారినపడే అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
Also Read: Weight Loss: బరువు తగ్గడం కోసం తిండి మానేస్తున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్?