Precautions For Heart Functioning: మనిషి శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె. ఇది పనిచేయకపోతే ఇక బతుకు తెల్లారిపోయినట్లే. దీంతో గుండె ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆధునిక కాలంలో ప్రతి వారి జీవన విధానం మారింది. అలవాట్లు కూడా మారాయి. పూర్వం రోజుల్లో అయితే పొద్దంతా పనిచేసి రాత్రి హాయిగా నిద్రపోయేవారు. కానీ ప్రస్తుతం మనకు అందుబాటులో వచ్చిన అధునాతన సదుపాయాలతో మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. రాత్రిళ్లు తింటూ పొద్దుపోయే వరకు కూడా నిద్ర పోకుండా మన జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. దీంతోనే రోగాలు కూడా ఇబ్బడిముబ్బడిగా వ్యాపిస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు దరి చేరి పలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయినా మనలో మార్పు వస్తుందా అంటే లేదు. నాగరికత పేరుతో ఇంకా విచ్చలవిడితనం పెరుగుతోంది.

ప్రస్తుతం వచ్చే జబ్బులన్నింటికి ప్రధాన కారణం అల్కహాల్. ప్రతి వారు మద్యం సేవించడం ఓ అలవాటుగా చేసుకున్నారు. అదో ప్రత్యేకమైన ఫ్యాషన్ గా మారిపోయింది. పెగ్గు తాగకపోతే కిక్కు ఉండదనే ధోరణికి అందరు వచ్చేశారు. ఇక యువత అయితే చెప్పనక్కర లేదు. రాత్రి అయిందంటే చాలు మందు తాగడమే వ్యసనంగా పెట్టుకున్నారు. దీంతో మన శరీరంలో అన్ని అవయవాలు పాడైపోతున్నాయి. ఫలితంగా ముప్పై ఏళ్లకే అన్ని రోగాలు ముసురుతున్నాయి. దీంతో బతుకు అగమ్యగోచరంగా మారుతోంది. అయినా ఎవరు కూడా వినడం లేదు. మంచి చెబితే ఎవరికి కావాలి. చెడు మార్గాలైతే తొందరగా ఆచరించడం మన వారికి ఉన్న ప్రధాన లోపమే.
సరైన ఆహారం తీసుకోకపోతే కూడా గుండెజబ్బులు వచ్చే ముప్పు పొంచి ఉంది. మనం రోజు తీసుకునే ఆహారంలో అన్నమే ప్రధానమైనది. ఇందులో కార్బోహైడ్రేడ్లు తప్ప విటమిన్లు, ప్రొటీన్లు ఉండవు. కనీసం ఒక శాతం కూడా బలమైన ఆహారం కాదు. అన్నం తింటే ఏదో కడుపు నిండిన ఫీలింగ్ కోసమే అన్నం తినడం చేస్తున్నారు. పోషకాలు ఉన్న ఆహారాలు చాలా ఉన్నాయి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి వాటితోనే ఆరోగ్యం ముడి పడి ఉందని తెలుసుకోవాలి. గుండె పనితీరు బాగా ఉండాలంటే అన్నం కచ్చితంగా మానేయాల్సిందే. లేదంటే ఎప్పటికైనా అన్నంతో మనకు ప్రమాదమే పొంచి ఉంటుంది.
ప్రతి రోజు వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 45-60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇందులో వాకింగ్, జాకింగ్, యోగా వంటివి చేస్తే మంచిది. మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చేస్తేనే ప్రయోజనం కలుగుతుంది. ఉదయం నడకతో ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్యులే చెబుతున్నారు. అందుకే మనం వీలైనంత వరకు ఉదయం పూట వాకింగ్ చేసి గుండె పనితీరును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుండెకు హాని కలిగించే వాటిని తీసుకోకపోవడమే ఉత్తమం. ఇవేమీ పట్టించుకోకపోవడంతోనే మన ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశాలు వస్తున్నాయి. వీటిని దూరం చేసుకునే క్రమంలో జాగ్రత్తలు పాటించి తీరాల్సిందే.
నిద్ర కూడా ముఖ్యమైనదే. నేటి రోజుల్లో చాలా మంది రాత్రిళ్లు తింటూ పగటిపూట నిద్ర పోతున్నారు. ఇది ప్రకృతి విరుద్ధమైన చర్య. ఎందుకంటే మనకు రాత్రి ఉన్నదే నిద్ర పోవడానికి పగలు ఉన్నదే పని చేయడానికి. కానీ కొందరు కావాలనే రాత్రి పూట మేల్కొని పగటిపూట పడుకుంటున్నారు. దీంతో మనకు రోగాలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గుండె పనితీరు నియంత్రించడంలో నిద్ర కూడా ప్రధానమైనది. అందుకే రాత్రి పూట ప్రశాంతంగా పడుకుని పగటి పూట పనులు చేసుకుంటేనే ప్రయోజనం.