ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. అయితే శాస్త్రవేత్తలు తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ఆస్తమాతో బాధ పడే వారికి కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడించారు. ప్రపంచ దేశాలను కరోనా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న తరుణంలో శాస్త్రవేత్తలు ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు.
Also Read: వారికి కరోనా సోకదు.. శాస్త్రవేత్తల సంచలన ప్రకటన..?
పిల్లలు, వృద్ధులపై ప్రభావం చూపుతున్న ఈ వైరస్ ఆస్తమా రోగులపై మాత్రం ప్రభావం చూపడం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో శాస్త్రవేత్తలు చేసే ప్రకటన వల్ల ఆస్తమా రోగులు ప్రశాంతంగా ఉండవచ్చు. ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి కరోనా మహమ్మారి గురించి ఈ విషయాలను వెల్లడించారు. ఆస్తమా రోగులపై అధ్యయనం చేసి ఆస్తమా రోగులకు కరోనా ముప్పు తక్కువని తేల్చారు.
Also Read: వెలుగులోకి మరో కొత్త వైరస్.. మనుషుల ప్రాణాలకే ప్రమాదమంట..?
కరోనా సోకిన 37 వేల మందిపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. కరోనా రోగుల్లో ఆస్తమా బారిన పడిన వారి సంఖ్య కేవలం 6 శాతంగా ఉందని.. 6 శాతం అంటే చాలా తక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఆస్తమా రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే వాళ్లు తక్కువగా వైరస్ బారిన పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
పరిశోధకులు మాత్రం ఆస్పత్రిలో చేరిన కరోనా రోగుల జాబితా ఆధారంగా ఈ విషయాలను వెల్లడిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే పలు కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించగా త్వరలో ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు పలు దేశాలు సిద్ధమవుతున్నాయి.