మెసేంజర్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ యాప్ కస్టమర్లను అలర్ట్ చేసింది. వాట్సాప్ పేమెంట్స్ చేసే కస్టమర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే మోసాల బారిన పడే అవకాశం ఉందని వాట్సాప్ హెచ్చరించింది. ఇటీవల యూపీఐ పేమెంట్స్ విభాగంలోకి అడుగుపెట్టిన వాట్సాప్ యాప్ ప్రాంతీయ భాషల్లో సైతం వాట్సాప్ పేమెంట్ సర్వీసులను అందిస్తోంది. కస్టమర్లు మోసాలకు గురి కాకుండా వాట్సాప్ కొన్ని సూచనలను విడుదల చేసింది.
Also Read: మార్కెట్ లోకి కొత్తరకం పెట్రోల్.. తక్కువ ధరతో ఎక్కువ లాభాలు..?
వాట్సాప్ పేమెంట్స్ కు సంబంధించిన వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఇతరులకు తెలియజేయకూడదని పేర్కొంది. బాగా పరిచయం ఉన్నవారికి, తెలిసిన వారికి మాత్రమే డబ్బు పంపాలని అపరిచితులకు డబ్బు పంపి మోసపోవద్దని పేర్కొంది. ఇతరులకు వాట్సాప్ కు సంబంధించిన వన్ టైమ్ పాస్ వర్డ్ చెబితే ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అపరిచితుల నుంచి అలాంటి కాల్స్ వస్తే సమీపంలో పోలీస్ స్టేషన్ లో లేదా సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయాలని పేర్కొంది.
Also Read: ఫోన్ చేయకుండా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే ఛాన్స్.. ఎలా అంటే..?
మొబైల్ ఫోన్ కు ఇచ్చే లింక్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అనవసర లింక్ లను క్లిక్ చేసినా మోసాల బారిన పడే అవకాశం ఉంటుందని.. ఎంత అప్రమత్తంగా ఉంటే మోసాల బారిన పడే అవకాశం అంత తగ్గుతుందని పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే పేమెంట్ రిక్స్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయవద్దని సూచనలు చేసింది. వాట్సాప్ పేమెంట్ సర్వీసులను సురక్షితంగా వినియోగించుకోవాలని సూచించింది.
మరిన్ని వార్తలు కోసం: జనరల్
బహుమతులు, లాటరీలు అంటూ వచ్చే కాల్స్ ను, మెసేజ్ లను అస్సలు నమ్మకూడదని తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనుమానాస్పద లింక్ లు వస్తే అలాంటి లింక్ లను బ్లాక్ చేయడమే మంచిదని సూచనలు చేసింది.