Food : యాభై ఏళ్లు దాటిన వారు ఆహారం ఎలా తీసుకోవాలో తెలుసా?

Food : యాభై ఏళ్లు దాటిన తరువాత జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ఏది పడితే అది తినకూడదు. సమయానికి మందులు వేసుకుంటూ తిండి కూడా టైంకే తినాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. దీంతో మన ఆరోగ్యం విషయంలో మనం తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం. ఇప్పటికే మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి రోగాలకు నిలయంగా మారుతుంటారు. ఈ నేపథ్యంలో మనం సరైన […]

Written By: Srinivas, Updated On : April 10, 2023 6:21 pm
Follow us on


Food :
యాభై ఏళ్లు దాటిన తరువాత జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ఏది పడితే అది తినకూడదు. సమయానికి మందులు వేసుకుంటూ తిండి కూడా టైంకే తినాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. దీంతో మన ఆరోగ్యం విషయంలో మనం తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం. ఇప్పటికే మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి రోగాలకు నిలయంగా మారుతుంటారు. ఈ నేపథ్యంలో మనం సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి.పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. శరీరానికి తగిన శక్తి లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల మంచి లాభాలు ఉంటాయి. తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటివి తీసుకోవడం వల్ల పోషకాలు అధికంగా అందుతాయి. దీని వల్ల మన ఆరోగ్యం మెండుగా కావడానికి ఆస్కారం ఉంటుంది.

ఉప్పు, పంచదార జోలికి పోవద్దు. వీటిని అధికంగా తినడం వల్ల మధుమేహం ముప్పు ఏర్పడుతుంది.దీంతో శరీరం గుల్లబారుతుంది. వీటి వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. అందుకే యాభై ఏళ్లు నిండిన వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉప్పు, పంచదారలను పూర్తిగా మానేయం మంచి ఫలితాలు ఇస్తుంది. దీనికి అందరు కచ్చితంగా కట్టుబడి ఉండాలి.

పీచులు అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇందులో పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల పేగు కదలికలు సులభంగా అవుతాయి. పొట్ట శుభ్రంగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సాయపడతాయి. ఈ నేపథ్యంలో పీచులు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

శరీరానికి తగినంత నీరు లేకపోతే హైడ్రేడ్ అవుతుంది. ఈ సమస్య నుంచి దూరం కావాలంటే సరైన మోతాదులో నీళ్లు తాగాలి. రోజు సగటున ఐదు లీటర్ల నీరు తాగితే మంచిది. దీంతో మనకు ఇబ్బందులు ఉండవు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. యాభై ఏళ్లు తాటితే ఇతర రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం తగినంత నీళ్లు తాగేందుకు చొరవ చూపించాలి.

Tags