Parijatha Flowers: మన పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి పారిజాత వృక్షం ఉద్భవించింది. ఈ పారిజాత వృక్షాన్నివిష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్ళాడు ఈ పారిజాతవృక్షం నుంచి వచ్చిన పుష్పాల సుగంధ పరిమళాలు స్వర్గం మొత్తం వ్యాపించాయి.అదేవిధంగా ద్వాపరయుగంలో సత్యభామగా కోరిక మేరకు పారిజాత వృక్షాన్ని భూలోకంలోకి తీసుకురావాలని చెప్పడంతో శ్రీకృష్ణ పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తీసుకు వచ్చారు. అందుకే పారిజాత వృక్షాన్ని సాక్షాత్తు దేవతా వృక్షంగా భావిస్తారు.
సాధారణంగా ప్రతి ఒక్క చెట్టు భూమి నుంచి ఉద్భవించి పుష్పాలను వికసిస్తుంది. కానీ పారిజాత వృక్షం పురాణాల ప్రకారం స్వర్గలోకం నుంచి వచ్చినది కనుక ఆ చెట్టులో వికసించే పుష్పాలు నేలను తాకినప్పుడు మనం వాటిని తీసుకొని పూజ చేయాలని చెబుతారు. అందుకోసమే పారిజాత వృక్షం కింద ఎల్లప్పుడూ ఆవుపేడతో అలికి శుభ్రంగా ఉంచి పూజ చేయడం వల్ల ఆ దేవ దేవతల అనుగ్రహం కలుగుతుంది.అయితే పొరపాటున కూడా ఎవరి దగ్గరైనా ఈ పారిజాత వృక్షాలను తీసుకొని పూజ చేయకూడదు అలా చేయడం వల్ల మనం చేసిన పూజాఫలం వారికే దక్కుతుంది.