మన దేశంలో చాలామంది అరటి ఆకులలో భోజనం చేయడాన్ని ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. చిన్న, సన్నకారు రైతులు అరటి ఆకుల వ్యాపారం ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు. పండుగలు, వేడుకలు, వివాహాల సమయంలో అరటి ఆకులను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. అరటి ఆకులలో వడ్డించే ఆహారం సైతం ప్రత్యేక రుచిని కలిగి ఉంటుందనే విషయం తెలిసిందే.

అరటి ఆకులలో భోజనం చేయడం వల్ల పర్యావరణానికి మేలు చేసే అవకాశంతో పాటు సౌత్ ఇండియాలో అరటి ఆకుల వార్షిక టర్నోవర్ 2 కోట్ల 50 లక్షల రూపాయలుగా ఉంది. కొన్ని రాష్ట్రాలలో అరటి ఆకుల సాగు వాణిజ్య పంటగా మారడం గమనార్హం. సంవత్సరం పొడవునా అరటి ఆకులకు డిమాండ్ ఉంది. సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం పొందాలని భావించే వాళ్లకు అరటి ఆకుల సాగు మంచిదని చెప్పవచ్చు.
కొన్ని ప్రత్యేక విత్తనాలను సాగు చేయడం ద్వారా ఈ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. పాయెన్, సకాయ్, కర్పూర్వల్లితో పాటు పూవన్, మొంతన్ విత్తనలను సాగు చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఈ చెట్ల యొక్క అరటిపండ్లను వేర్వేరు ఆహారాల్లో వినియోగించవచ్చు. రోజురోజుకు అరటి ఆకులకు డిమాండ్ పెరుగుతుండగా అరటి రైతులు అరటి ఆకులను పెద్దఎత్తున ఎగుమతి చేస్తున్నారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలని భావించే వాళ్లకు అరటి ఆకుల వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపించే రైతులు ఈ పంటలపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.