కూల్ హీరో నాగ చైతన్య కెరీర్ లో మొదటిసారి “లాల్ సింగ్ చద్దా” అనే సినిమాతో బాలివుడ్ లోకి అడుగుపెట్ట బోతున్నాడు. పైగా ఈ సినిమాలో స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరో. అయితే ఈ భారీ బాలీవుడ్ సినిమాలో నాగ చైతన్య పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఇక ఈ సినిమాని మొదట ఈ క్రిస్మస్ కి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు, అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేశారు.

కానీ, ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కావడం లేదు. విడుదల తేదీని అమీర్ ఖాన్ మరోసారి వాయిదా వేశారని తెలుస్తోంది. మహారాష్ట్రలో థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి, రిలీజ్ ని వాయిదా వేశారట. అయితే, ఈ రోజు ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అక్టోబర్ 22 తర్వాత థియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇస్తామని ప్రకటించారు.
కాబట్టి, అనుకున్న డేట్ కే అమీర్ తన “లాల్ సింగ్ చద్దా” సినిమాని రిలీజ్ చేయవచ్చు. కానీ, అమీర్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాది తన సినిమా రిలీజ్ కి సముఖంగా లేడు. అయితే, అమీర్ ఖాన్ తన సినిమాని పోస్ట్ ఫోన్ చేయడానికి ముఖ్య కారణం.. పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ కి క్యూలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తోటి స్టార్ హీరోలతో పోటీ పడి సినిమాని రిలీజ్ చేసి.. వచ్చే కలెక్షన్స్ ను షేర్ చేసుకొవడం ఎందుకు అనేది అమీర్ ఆలోచనగా తెలుస్తోంది.
అందుకే, తన సినిమాని వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక తన సినిమా విడుదల సమయంలో మరో పెద్ద సినిమా పోటీలో లేకుండా కూడా అమీర్ ఖాన్, తోటి హీరోలతో చర్చించినట్లు టాక్ నడుస్తోంది.
ఇక అమీర్ ఖాన్ కి, నాగ చైతన్యకి మధ్య ఈ సినిమా షూటింగ్ సమయంలో మంచి స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి అమీర్ తరుచుగా హైదరాబాద్ వస్తున్నారట. నేరుగా చైతు ప్లాట్ కే వెళ్తున్నాడట. చైతన్య ‘లవ్ స్టోరీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి కూడా అమీర్ ఖాన్ ప్రత్యేక అతిధిగా రావడం విశేషం.